ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ………… ఈసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్తారా…
సౌత్ఏ 9 : ప్రతినిధి
పీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మరోసారి ఎన్ డి ఏ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఎన్డీఏ ఎమ్మెల్యేలతో భేటీలో నిర్వహిస్తున్న చంద్రబాబు మరోసారి వీరిని కలుసుకోనున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వీరిపై వస్తున్న ఆరోపణ నేపథ్యంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో తాజాగా మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయి షాపులు కేటాయించారు. అయితే ఇందులో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.వీటిపై టిడిపికి అనుకూలంగా ఉండే మీడియాలోనే రోజు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.. ఈ నేపథ్యంలో మద్యం టెండర్లలో జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇసుక తవ్వకాల విషయంలోనూ అధికార పార్టీల నాయకుల పై ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలని నేరుగా సీఎం చంద్రబాబు చెప్తున్నా క్షేత్రస్థాయిలో నేతలు వినిపించుకునే పరిస్థితులు లేవు. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అక్రమాల ఎమ్మెల్యేలకు మరోసారి హెచ్చరికలు పంపనున్నారు. అలాగే రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాల పైన చంద్రబాబు, పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Comments are closed.