తేది: 02, ఫిబ్రవరి 2023*
: గుంటూరు*
దళిత వ్యతిరేకి చంద్రబాబు.. అందుకే 23కి పరిమితమయ్యారు*
*జగనన్న పాలనలో దళితులకు పూర్తి సంక్షేమ పథకాలు అమలు*
*వైసీపీలోనే ఉంటా….జగనన్నతోనే నా రాజకీయ ప్రయాణం*
*ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాశీర్వాదం జగన్నన్నకే: ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత*
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్నీ రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?.. అని ఆనాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన మాజీ హోంమంత్రి.. భారత రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు పుట్టిన కులంలో తను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు పూర్తిగా దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసిన జగనన్నకు ప్రజాశీర్వాదం ఉందని చెప్పారు. జగన్ పాలనలో నిరుపేద దళితులకు సంక్షేమ పథకాలు అదుతున్నాయని తెలిపారు.
తను పార్టీ మారుతున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆధారంగా తీసుకొని కొన్ని ప్రధాన ఛానళ్లు.. పేపర్లలో వస్తున్న కథనాలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే ఎల్లో మీడియా ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రచురించే ముందు నేరుగా తనని సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు. పార్టీ మారడం అంటే నేను ఇంటికే పరిమితమవుతానని స్పష్టం చేశారు.
దివంగత మహానేత వైఎస్సార్ చలవతో 2009లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా తాను ఎన్నికయ్యానని.. తదనంతర పరిణామాలలో ఎమ్మెల్యేగా రాజీనామాను చేసి ఆనాడు వైసీపీ అధినేత జగన్ వెంట నడిచానని గుర్తుచేశారు. కడవరకు జగనన్నకు తోడుగా వైసీపీకి విధేయురాలిగా ఉంటానని ఆమె పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట అమలుచేసే.. విలువలతో కూడిన నిజాయితీ కలిగిన నేత సీఎం జగన్ అని ఎమ్మెల్యే కొనియాడారు. జగన్ ఆశీర్వదించి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడినుంచి పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పెను మార్పులు తీసుకువచ్చి భావితరాలకు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపీంగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని.. కావాలనే కొందరు పార్టీ అధినాయకత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం సరిగా పరిపాలన చేస్తే 23 సీట్లకే పరిమిత మయ్యేవారా అని ఎద్దేవా చేశారు. గడప గడపకు కార్యక్రమంలో మంచి స్పందన వస్తుందని ఆమె వివరించారు.
Comments are closed.