The South9
The news is by your side.
after image

చంద్రబాబు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు తోడేళ్ల గుంపులా తయారైయ్యారు: సీఎం జగన్.

తేదీ: 08-07-2023

 

*వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో సీఎం జగన్*

 

*10.2 లక్షల రైతులకు రూ.1,117 కోట్ల ఖరీప్‌–2022 బీమా పరిహారం విడుదల*

*చంద్రబాబు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు తోడేళ్ల గుంపులా తయారైయ్యారు*

 

*ఎన్నికల సమయంలో వీళ్లు మరిన్ని అబద్దాలు చెబుతారు.. ప్రజల జరిగిన మంచిని మాత్రమే గమనించాలి*

 

*మనది రైతుల పక్షపాతి ప్రభుత్వం.. రైతులకి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం*

 

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం నాడు వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ, బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు.

 

Post midle

*బీమా కింద చంద్రబాబు ఇచ్చింది రూ. 3,411కోట్లు మాత్రమే.. కానీ, మీ బిడ్డ చెల్లించింది రూ.7,802 కోట్లు*

 

Post Inner vinod found

‘‘ఐదేళ్లలో చంద్రబాబు రూ. 3,411కోట్లు మాత్రమే బీమా కింద చెల్లించారని.. రైతులకు అరకొరగానే బీమా డబ్బులు ఇచ్చారని చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని సీఎం విమర్శించారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు కరువును పారద్రోలాడని పచ్చ మీడియా నిసిగ్గుగా అసత్యాలు రాశాయని సీఎం దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం​ వరుకు ఆర్బీకేల రూపంలో రైతులకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. పచ్చ మీడియా, దత్తపుత్రుడు తోడేళ్లలా తయారైయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతి ఏటా మూడు విడతల్లో వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30,985 కోట్లు రైతు భరోసా అందించామన్నారు.

 

*మనది రైతుల పక్షపాతి ప్రభుత్వం*

 

‘‘రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం​ చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ఈ నాలుగేళ్లలో కేవలం రైతుల సంక్షేమం కోసమే అక్షరాలా రూ. 1,70,769.23 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు.

 

*రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి*

 

సున్నా వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో పంటనష్టానికి ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం అందిస్తున్నామన్నారు. పంటల గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాకా రూ.58,767 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తున్నామని అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

‘‘మనకు పాడిపంటలతో పండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలతో ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిగా చంద్రబాబును అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని సీఎం చెప్పారు. ఎన్నికల సమయంలో వీరందరు చెప్పే అబద్దాలను నమ్మవద్దని, ప్రజలకు జరిగిన మంచిని మాత్రమే చూడాలని సీఎం కోరారు.

 

*నాన్న చేసిన మంచి ఎప్పటికీ నిలిచిపోతుంది*

 

ఏ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు దివంగత నేత రాజశేఖరరెడ్డి గుర్తొస్తారన్నారు. నాన్న భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. ఆయనను గౌరవిస్తూ మనం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లోనూ డాక్టర్‌ వైఎస్సార్‌ పేరే పెడుతున్నామన్నారు. ఆర్బీకేల్లో ప్రతి గ్రామంలో ఎవరికి ఎంత ఇన్సూరెన్స్‌ వస్తోందని, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అన్నీ టెస్టింగ్‌లు చేస్తున్నారని, సోషల్‌ ఆడిట్‌లో పేర్లు పెడుతున్నారు, అభ్యంతరాలు కూడా తీసుకుంటున్నారని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చేపడుతున్న గొప్ప కార్యక్రమాల్ని రాజకీయాలు, వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Post midle

Comments are closed.