The South9
The news is by your side.
after image

ఆంధ్రప్రదేశ్ లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 

తేదీ: 16-06-2021,
న్యూఢిల్లీ.

ఆంధ్రప్రదేశ్ లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

రూ.25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్

వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు స్థాపనకు కేంద్రం ముందడుగు

పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మిస్తే 50 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు

రానున్న 2,3 ఏళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం

Post midle

ఈస్ట్ కోస్ట్ కారిడార్ లో రూ. 25 నుంచి 30 వేల కోట్ల పెట్టుబడులు

ఫీడ్ స్టాప్ బయట నుంచి రావాలి, ప్లాస్టిక్ లో 25 రకాల పాలిమర్స్ ఉన్నాయి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం

ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం

ఇటీవల పెట్రోల్ లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం

తద్వారా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు

రిఫైనరీ సామర్థ్యం పెంచాలనుకోవడం, మొలాసిస్ ఉత్పత్తి ఎక్కువగా చక్కెర కర్మాగారాల ద్వారా వస్తున్నదాని ద్వారా ఇథనాల్ గా మార్చడం కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్

పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది

Post Inner vinod found

*వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం*

*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో చర్యలు*

*ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ప్రాజెక్టు పనులు మొదలు*

*అదే జరిగితే ప్రైవేటు పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి*

*అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన నేను గతంలో చెప్పినవి రెండేళ్ళలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు, పరిశ్రమలపైనా మరోసారి స్పష్టతనిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి*

*ఎంవోయూల గురించి చెప్పలేదు. కేవలం గ్రౌండ్ అయినవి మాత్రమే ఓపెన్ గా ప్రకటించాం*

*రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవడమే కాకుండా, మరో రూ.16వేల కోట్లు ఎస్ఐపీసీలో క్లియర్ అయ్యాయి. ఎస్ఐపీబీ అనంతరం వీటిపై కూడా పూర్తి క్లారిటీ*

*కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదు*

*ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల గురించి అది కూడా 2019 నుంచి గ్రౌండ్ అయినవే చెప్పాం*

*కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ బృందం*

*ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించారు*

*సీఎం తాజా సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్ గురించి కేంద్రమంత్రితో మరోసారి ప్రధానంగా చర్చించాం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సానుకూలంగా స్పందించింది*

*ఢిల్లీలోని శాస్త్రిభవన్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా తదితరులు*

————————–

Post midle

Comments are closed.