న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల లో ఒకటైన ట్విట్టర్ మీద రోజుకు ఒక అంశం వివాదాస్పదమవుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర బీజేపీ అగ్రనేతల ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించిన బ్లూ టిక్ (వేరి ఫైడ్) తొలగించడం తో అది వివాదాస్పదం అయింది. వెంటనే ట్విట్టర్ మరల పునరుద్ధరించడం జరిగింది. ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో బిజెపి నేతలపై విమర్శలు చేశారు. కోవిడ్ టీకాలు పొందడంతో (ఆత్మ నిర్భర్) సాధించాలని అంటూ దేశ ప్రజలను గాలికొదిలేసి, ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంపర్లాడుతున్నదని, వ్యంగ్యంగా అన్నారు . అలానే డిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలోని పనిచేసే కేరళకు చెందిన నర్సులు మలయాళ భాషలో మాట్లాడడం గురించి ఆ సంస్థ ఉద్యోగుల్ని హెచ్చరించిన ఘటనపై రాహుల్ స్పందించారు. దేశ భాషలలో ఒక్కటైన మలియాళ భాషపై వివక్ష పనికి రాదని, అన్నారు.
ब्लू टिक के लिए मोदी सरकार लड़ रही है-
कोविड टीका चाहिए तो आत्मनिर्भर बनो!#Priorities— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2021
Comments are closed.