The South9
The news is by your side.
after image

వైయస్ వివేకా కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన సీబీఐ!

కడప ; మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రముఖులను అరెస్ట్ చేయనున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి బెయిల్ కి సంబంధించిన వాదనలో భాగంగా ఈ విషయాన్ని కోర్టుకి తెలిపింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతంలో నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలం మేరకు దేవి రెడ్డి శంకర్ రెడ్డి ని ఈ కేసులో ముద్దాయిగా తేల్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. మామూలుగా కేసు కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి లీకులు ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతుంది. పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఈ కేసులో ఉందనే ఆరోపణల నేపథ్యంలో సి.బి.ఐ కోర్టుకి తెలిపిన విషయం తో కేసు కీలకదశకు వచ్చినట్లు అనిపిస్తుంది

Post midle

Comments are closed.