ముంబై: జీవీకే గ్రూపు ఛైర్మన్ జి.వెంకటకృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో రూ.805 కోట్లు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు.
జీవీకే ఛైర్మన్ తో పాటు ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చెందిన అధికారులు, ప్రైవేటు కంపెనీలకు చెందిన 9 మందిపై కేసు పెట్టారు. 2012-2018 మధ్య ఈ లూటీ జరిగిందని తన ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ముంబై ఇంటర్నేషన్ ఏయిర్ పోర్టు లిమిటెడ్ ను జీవీకే ఏయిర్ పోర్టు హోల్డింగ్స్ లిమిటెడ్, ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, మరికొన్ని అంతర్జాతీయ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు.
ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు లిమిటెడ్ కు జీవీకే.రెడ్డి ఛైర్మన్ కాగా, ఆయన కుమారు జీవీ.సంజయ్ రెడ్డి ఎం.డీ గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో జీవీకే గ్రూపునకు 50.5 శాతం వాటాలు ఉన్నాయి. 2006 లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రెవిన్యూ ను షేర్ చేసుకుంటున్నాయి.
ఏలాంటి పనులు చేయకుండానే రూ.310 కోట్లు నొక్కేశారని సీబీఐ తేల్చింది. నేరపూరిత స్వభావంతో జీవీకే గ్రూపు ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నష్టం కలుగ చేసింది. ముంబై ఇంటర్నేషన్ ఏయిర్ పోర్టు లో మిగులు డబ్బులు రూ.395 కోట్లు తమ స్వంత సంస్థలకు మళ్లించారని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇలా లెక్కించుకుంటూ వెళ్తే రూ.1 వేయి కోట్లకు పైగానే ఉంటుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
Comments are closed.