వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎస్సై వెంకట రమణ*
నెల్లూరు క్రైమ్ ప్రతినిధి :
* 13 సంవత్సరాల్లో 11 పోలీస్ స్టేషన్ లకు బదిలీ*
* గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టుకొని సినీ హీరోలా… లీనం*
* అమాయక ప్రజలను కొట్టడమే అతని లక్ష్యం..*
* ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా సక్రమంగా విధులు నిర్వహించని పరిస్థితి..*
* ఎక్కడ చూసిన గొడవలు కొట్టడం కొట్టించుకోవడం..*
*మర్రిపాడు ఎస్సైగా విధుల్లో చేరిన నాటి నుండి వివాదాలు*
* చివరకు వికలాంగుడు తిరుపతి ఆత్మహత్య కు కారకులుగా మారడం*
* డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ విజయరావు ఎస్సై వెంకటరమణ ను సస్పెండ్ చేసిన వైనం*
* ఎస్సై తో పాటు ఏ ఎస్సై జయరాజు ,ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్*
*డిజిపి,జిల్లా ఎస్పి లపై జిల్లా ప్రజలు,మర్రిపాడు ప్రజలు ప్రశంసలు*
*ఎస్సై వెంకట రమణ సస్పెండ్ పై జిల్లా ప్రజలు హర్షం*
*జిల్లా ఎస్పీ విజయరావు కు మృతుడు తిరుపతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు*
*అమాయక ప్రజలను కొట్టడం మరీ కొన్ని చోట్ల కొట్టించుకోవడం ఆయన నైజం, అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న మండలాల్లో ఎస్సై గా విధుల్లో చేరి వివాదాలు సృష్టిస్తూ గబ్బర్ సింగ్ సినిమా లో హీరో పవన్ కళ్యాణ్ లా లీనం అయ్యిపోవడం,ఖాకి డ్రెస్ వంటి పై ఉంటే ఆయన గబ్బర్ సింగ్ లా ఫీల్ అయ్యే ఎవరిని పడితే వారిని కొట్టడం,స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తు చివరకు మహిళల పై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ చివరకు ఒక వికలాంగుడు ఆత్మహత్య కారణం అయ్యి చివరకు సస్పెండ్ వేటు గురయ్యారు మర్రిపాడు ఎస్సై తురాక వెంకట రమణ*
*2011 లో ఎస్సైగా విధుల్లో చేరిన ఎస్సై వెంకటరమణ 13 ఏళ్ళలో 11 సార్లు బదిలీలు, వి ఆర్ లో ఉండి సస్పెండ్ గురై సుమారు 22 కేసుల్లో ముద్దాయిగా పోలీస్ శాఖలో చరిత్రలో నిలిచారు. ఇటీవల మర్రిపాడు ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన వెంకట రమణ వివాదాలుకు కేరాఫ్ గా నిలిచారు. ఎస్సై ని సస్పెండ్ చేయాలి అనీ ధర్నాలు,బంద్ లు చేశారు, చివరకు వికలాంగుడు తిరుపతి ని వేధించడం తో మనస్తాపం చెంది తిరుపతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిపాడు సబ్ ఇన్స్పెక్టర్ తురక వెంకటరమణ, ఏఎసై జయరాజు ఇద్దరు కానిస్టేబుళ్లను నెల్లూరు జిల్లా ఎస్పీ విజయ రావు సస్పెండ్ చేశారు.*
*జిల్లాలో నలుగురు పోలీసులపై వేటు సంచలనం*
*నెల్లూరు జిల్లాలో మర్రిపాడు పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో మర్రిపాడు ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఓ దివ్యాంగుడు ఆత్మహత్య కేసులో ఈ నలుగురు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మర్రిపాడు ఎస్సై వెంకటరమణ, ఏఎస్సై జయరాజ్, కానిస్టేబుల్స్ చాంద్ బాషా, సంతోష్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.*
*ఇక, ఇటీవల జిల్లాలోని అనంతసాగరం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇందుకు పోలీసుల వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. చోరీ కేసులో తమ కుమారుడిని మర్రిపాడు ఎస్‌ఐ వెంకటరమణ కొట్టాడని.. గురువారం పోలీసు స్టేషన్‌కి రావాలని పిలిచారని చెప్పారు. అయితే పోలీసు స్టేషన్‌లో మళ్లీ కొడతారేమోనన్న భయంతో తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.*
*నెల్లూరు జిల్లా మర్రిపాడు కు చెందిన ఎసై మర్రిపాడుకు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై తో సహా నలుగురుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా యస్.పి. తిరుపతి ఆత్మహత్య పైన ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణతో 1-SI, 1-ASI, 2-PC లను సస్పెండ్.తదుపరి శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు.*
*సస్పెండ్ అయిన వారి వివరాలు:*
*SI తురక వెంకటరమణ(మర్రిపాడు పోలీస్ స్టేషన్),*
*ASI-1007 T. జయరాజ్,*
*PC-1498 SK.చాంద్ బాషా,*
*PC-2617 V. సంతోష్ కుమార్ లు సస్పెండ్.*
Comments are closed.