చంద్రబాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకోం…. జగన్కు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలటా ?
చంద్రబాబు పాలన చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు? జగన్ హయాంలో రాష్ట్రంలో భూ కబ్జాలు వివాదాలు పెరిగాయి…
తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నాము,,, టిడిపి అధికార ప్రతినిధి పాతర్ల రమేష్,,,
అమరావతి ఆగస్ట్ 8
భద్రత పునరుద్ధరించాలన్న జగన్ పిటిషన్‌పై చర్చ నడుస్తోందని,
900 మందితో సీఎం రేంజ్ సెక్యూరిటీ కావాలని జగన్ కోరడం వెనక గుట్టేంటని
తనకి ప్రాణహాని ఉందంటూ జగన్ కొత్త డ్రామాకు తెర లేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు అమరావతిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఇన్నాళ్లూ కోర్టులను పట్టించుకోని జగన్‌కు ఇప్పుడు కోర్టులు దిక్కయ్యాయాని ఆయన విమర్శించారు
ఏపీలో ఉండాలంటే అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ హైకోర్టు ఆశ్రయించటం సిగ్గుచేటు అన్నారు జగన్ కు 900 మంది సెక్యూరిటీ కావాలని అడగటం దుర్మార్గమన్నారు, ప్రతిపక్ష హోదా ఉన్న 11 మంది శాసనసభ్యులు కలిగిన జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా రావాలంటే 18 మంది సభ్యులు ఉండాలని అంతమాత్రం కూడా జగన్కు తెలియదా అని ఆయన అన్నారు
కోడికత్తి కేసులు, గులకరాయి ఘటనలు చూపించి జగన్ కు ప్రాణహాని ఉందని అంటున్నారని ఆయన విమర్శించారు
అసలు జగన్‌కు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
జగన్‌లో కనిపిస్తున్నది కంగారా..? బేజారా..? భయమా..? గేమ్ ప్లానా..?
మాట్లాడితే అర్థం ఉండాలని ఆయన అన్నారు రాష్ట్రంలో శాంతిభద్రతను పూర్తిగా కంట్రోల్ లో ఉన్నాయని ఆయన తెలిపారు చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వైసీపీ విష ప్రచారం చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను దిగజార్చేలా చేశారన్నారు ఆంధ్రప్రదేశ్లో త్వర త్వరగా అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని అమరావతిలో రాజధాని పనులు వేగవంతం అయ్యాయని జంగిల్స్ ను క్లియర్ చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కబ్జాలు వివాదాలపై సిసోడియా వ్యాఖ్యలు సూచనలు ఆలోచింపజేస్తున్నాయన్నారు చంద్రబాబు మనసు ఎంతో చల్లనిదో ఆయన పాలన చూస్తుంటేనే రాష్ట్ర ప్రజలకు అర్థమయిందన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా కాకముందే ఏపీ ఎన్జీవో నాయకులు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు జగన్ పాలనలో ఐదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేతనాలు సకాలంలో ఇవ్వకుండా గత వైసిపి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిందని ఆ ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి ఆనాడు జగన్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు చంద్రబాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు చంద్రశేఖర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు చంద్రశేఖర్ ఎందుకు రెడ్డి మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం కుటమి ప్రభుత్వం పైన చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు పడుతున్నాయని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వం లో ఉద్యోగులు ఎన్నో ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగుల సమస్యలను తెలుసుకునే పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు
Comments are closed.