“బ్యాక్ డోర్”తో అందరికీ
బంపర్ ఆఫర్స్ రావాలి!!
-దర్శకసంచలనం పూరి జగన్నాధ్
నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “బాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ బంపర్ ఆఫర్స్ రావాలని ఆకాంక్షించారు సంచలన దర్శకులు పూరి జగన్నాధ్. “బ్యాక్ డోర్” చిత్రంలోని “రారా నన్ను పట్టేసుకుని” అనే పల్లవితో సాగే గీతాన్ని పూరి ముంబైలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన సంగీత దర్శకుడు ప్రణవ్, గీత రచయిత్రి నిర్మల, దర్శకుడు కర్రి బాలాజీ, నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, హీరో తేజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఛార్మి కూడా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్ దేవరకొండతో… ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామ్యంతో.. హిందీ, తెలుగు భాషల్లో “లైగర్” చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పూరి జగన్నాధ్… ఈమధ్యకాలంలో ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. తమ చిత్రం నుంచి మొదటి పాటను పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల చేసి, ఇప్పటికే తమ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ ను రెట్టింపు చేసుకోవాలనే కృత నిశ్చయంతో… చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకుడు ప్రణవ్, హీరో తేజ… ప్రత్యేకంగా ముంబయి వెళ్లి… ఈ పాటను పూరితో విడుదల చేయించారు. “లైగర్” చిత్రం పనులతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ… తమ కోసం అమూల్యమైన సమయం వెచ్చించి.. “బ్యాక్ డోర్” చిత్రంలోని పాటను రిలీజ్ చేసి, సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని అభిలషించిన పూరీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని దర్శకుడు కర్రి బాలాజీ అన్నారు. తనను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న “బ్యాక్ డోర్” చిత్రం నుంచి తొలి గీతం పూరి ఆవిషరించడం పట్ల ప్రణవ్ పట్టరాని సంతోషం వెలిబుచ్చారు.
ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ‘బ్యాక్ డోర్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!
Comments are closed.