బహుజన అబ్జర్వవన్స్ సర్వీస్ సొసైటీ ( బాస్ ఇన్ ఏపీ) సమావేశం
సుదీర్ఘ చర్చలు-కార్యాచరణ ప్రణాళికలు
ఎస్సి,ఎస్టీ,బిసి మైనారిటీ లు కలిసి రాజ్యాధికారం కోసం కలిసి పోరాడుదాం
రాజ్యాంగాన్ని కాపుడుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా బాస్ ఇన్ ఏపీ ఆధ్వర్యంలో ఎన్నికల బరిలోకి
అన్నీ కుల సంఘాలు ఏకం కావాలి
బాస్ ఇన్ ఏపీ లో యువతకు ప్రాధాన్యం
బాస్ ఇన్ ఏపీ గౌరవ అధ్యక్షుడు అవల ప్రసాద్ రావు
బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తీసిన లెక్కల ప్రకారం మనదేశంలో 85% ఎస్సి, ఎస్టీ,బీసీ, మైనార్టీ జనాభా ఉన్నట్టు తేలింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా దేశంలో 85 శాతం పైగా ఉన్న దళిత బహుజన సామాజిక వర్గాలపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక పై ఇది సాగదు. ఎస్సి,ఎస్టీ, బిసి,మైనార్టీ సామాజిక వర్గాలు నిజాన్ని తెలుసుకున్నాయి. దశాబ్దాలుగా దళిత బహుజన లకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే దిశగా ప్రయాణానికి సిద్ధమయ్యాయి అనీబహుజన అబ్జర్వవన్స్ సర్వీస్ సొసైటీ ( బాస్ ఇన్ ఏపీ) గౌరవ అధ్యక్షుడు అవల ప్రసాద్ రావు, రిటైర్డ్ డిఎస్పీ ప్రసాద్ లు పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు ఎఫ్ 2 లో నెల్లూరుజిల్లాలోనిఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ సంఘాలు బాస్ ఇన్ ఏపీ పిలుపు మేరకు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిలు సిద్ధం చేసి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా అవల ప్రసాద్ మాట్లాడుతూ ఆధిపత్య సామాజిక వర్గాల కారణంగా దగాపడ్డ బడుగు, బలహీన ఎస్సి,ఎస్టీ, బీసీ,మైనార్టీ సమాజం తమ బతుకులు బాగుచేసుకోవాలని నిర్ణయించుకుంది అనీ తెలిసిందే. బహుజనులు రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యారు.ఇటీవల కాలంలో రకరకాల పేర్లతో సంఘాలు, ట్రస్ట్‌లు ఏర్పాటు చేసుకుని వారివారి స్థాయిలో కులాల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ‘బహుజన రాజ్యాధికారం’ అనే లక్ష్య సాధన కోసం ప్రజాస్వామ్య బద్ధంగా గొప్ప సమాజంగా ఎదగాలంటే ఏం చేయవలసి ఉంది? అనేది ఆలోచించాలి. బహుజనులు సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కులా సంఘాల విధివిధానాలకు, పద్ధతులకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. బహుజన సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ బద్ధమైన పద్ధతులకు అవకాశం ఉన్నప్పుడు అదే మార్గంలో ప్రయత్నం కొనసాగించాలి అనీ కోరారు. బహుజనల గౌరవాన్ని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను ఎంత గొప్పవారైనా గానీ వారి పాదాల దగ్గర పెట్టకూడదు. అప్పుడే బహుజన ల ఆత్మగౌరవం నిలబడుతుంది ఆయన తెలిపారు.
అంబేద్కర్ పేరుతో దగా: వేగురూ విజయ్ కుమార్
కొంతమంది భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేసి మోసాలు చేస్తున్నారు వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనీఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగురూ విజయ్ కుమార్ తెలిపారు. అధికారం లో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంకు తూట్లు పొడుస్తున్నారు.అందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి పిలుపునిచ్చారు.
ఎంత గొప్పవారైనా సరే, వారిని నమ్మి బహుజన ఆశయాలతో నిండి ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలను, అధికారాన్ని మనం గొప్ప వారనుకునే వారి చేతుల్లో పెట్టకూడదు అనీ కోరారు‘‘ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరు’’ అనే సూత్రం మాదిరిగా ఉండాలి అనీ కోరారు. బహుజనల్లో మితిమీరిన స్వామిభక్తి, వ్యక్తి పూజ, ధనవంతుల భజన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఉద్దేశించిన అన్నీ కులాలను చైతన్యపరిచే విషయంలో విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడం అనే మహత్తర కార్యాన్ని సాధించడంలో ఈ వ్యక్తి పూజలు, స్వామి భక్తి వంటివి సంఘాల పతనానికి దారి తీస్తాయి. అప్పుడు కొందరి కేంద్రీకృత నియంతృత్వానికి లోబడి పని చేయాల్సి వస్తుంది.
స్వేచ్ఛా, సమానత్వాలు వికసించాలంటే: బాస్ ఇన్ ఏపీ ప్రధాన కార్యదర్శి ,రిటైర్డ్ డిఎస్పీ ప్రసాద్
సంఘాలు, సంస్థల ద్వారా బహుజనలను సామాజికంగా ఆధిపత్య వర్గాల మాదిరిగా సామాజికంగా చైతన్యం అయ్యేలా కృషి చెయ్యాలి. బహుజనలందరికీ సామాజిక ప్రజాస్వామ్యపు ఫలాలు అందేలా కృషి చెయ్యాలంటే సామాజిక ప్రజాస్వామ్యం గురించి ముందుతెలుసుకోవాలి అనీబాస్ ఇన్ ఏపీ ప్రధాన కార్యదర్శి ,రిటైర్డ్ డిఎస్పీ ప్రసాద్ పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం జీవన సూత్రాలుగా గుర్తించే జీవన విధానాన్నే సామాజిక ప్రజాస్వామ్యం అంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి వేర్వేరు అని భావించరాదు. ఇవి మూడు కలిసి ఉండే ఒకే ఐక్యసూత్రం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాటిలో ఒకదాని నుంచి మరొకదాన్ని వేరు చేస్తే అసలు బహుజన సంఘాలు, సంస్థల ప్రజాస్వామ్య ప్రయోజనమే దెబ్బతింటుంది. స్వేచ్ఛను సమానత్వం నుంచి వేరు చేయడానికి వీలులేదు. సమానత్వాన్ని స్వేచ్ఛ నుంచి వేరు చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ సౌభ్రాతృత్వం నుంచి వేరు చేయలేం. సమానత్వం లేకుండా స్వేచ్ఛ మాత్రమే ఉంటే అది అనేకుల మీద కొందరి ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వేచ్ఛ లేకుండా సమానత్వం మాత్రమే ఉంటే అది వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్ఛ, సమానత్వాలు సహజంగా వికసించలేవు. వాటిని అమలు చేయడానికి సౌభ్రాతృత్వం అనేది రక్షక భటునిగా ఉండాలి అనీ ఆయన తెలిపారు.
కులాధిక్య భావాలు ఉంటే:
–వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ మగ్ధూమ్
మన సమాజంలో ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం మూడింటిలో రెండు ఎంతమాత్రం లేవనే గుర్తింపుతో బహుజన సంఘాల నాయకత్వాలు పని ప్రారంభించాలి. ఆ రెండింటిలో ఒకటి సమానత్వం. ఇండియాలో తారతమ్యం, అసమానత అనే సూత్రం పునాదిగా ఉంది. అంటే ఈ సమాజంలో కొందరికి అపార సంపద, అసంఖ్యాకులు దుర్భర దారిద్ర్యంలో జీవించే స్థితి ఉంది. రాజ్యాంగంలోనేమో అందరికీ సమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం అందరికీ అసమానత్వం ఉంటుంది. రాజ్యాంగంలో అందరూ మనుషులే. అందరికీ ఒకే ఓటు.. ఓకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కానీ సమాజంలో అలా లేదు. ఇది అందరికీ తెలిసిన నిజమే. కానీ బహుజనల సామాజిక, ఆర్థిక జీవనంలో కూడా బహుజనల వ్యవస్థ ‘ఒక మనిషికి ఒకే విలువ’ అనే సూత్రాన్ని నిరాకరించడం చూస్తాం. మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనకు ఇతరులు.. మనకన్నా కింద వాళ్లకీ సమానత్వాన్ని నిరాకరిస్తున్నాం. ఎంతకాలం ఇలా కొనసాగగలం? ఇది దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా మనం చూడవచ్చు. కనుక ఈ సంఘర్షణ నుంచి బహుజనలను బయటికి తీసుకురావాలి. ఇది చాలా ముఖ్యమైన పనిగా తీసుకుని ఆ దిశగా కృషి చెయ్యాలి. మరో ముఖ్య విషయం ఏమంటే.. బహుజన కులాల్లో ఎవరికైనా కులాధిక్య భావనలు.. అంటే కింది కులాల వారికంటే గొప్ప అనే భావన కలిగి ఉండటం. కులం/రంగు కారణంతో నీచమైన భావన కలిగి/ వివక్షా పూరితంగా ప్రవర్తించే అలవాట్లు కలిగిన వారు ఉంటే అటువంటి వారిని సరిదిద్ది మానవత్వంతో నడుచుకునేలా మార్చుకోవాలి.
ఒకే మార్గంలో నడవాలి..
-ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు రవి రాఘవేంద్ర
ప్రస్తుతం దేశమంతటా బహుజనలను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీలు, పదవులు, పథకాలు అంటూ పలు రకాల ఆశలతో మోసం చేస్తూ బహుజనలను విడదీసి పాలించాలనుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, సంఘాలు, పార్టీల్లో సభ్యత్వం కలిగి ఉన్నా అటువంటి వారి అభిప్రాయాలను మోసే వారిని బహుజన సంఘాలు, సంస్థల్లో కంట్రోల్ చేస్తే బాగుంటుంది. మనం స్వచ్ఛంగా మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ దారిలో నడవాలి. చివరగా.. మరో ముఖ్య అంశం.. ‘సౌభ్రాతృత్వ భావనను’ గుర్తించకపోవడం. మన సామాజిక జీవనానికి ఐక్యతను, సంఘీభావాన్ని ఇచ్చే సూత్రమే సౌభ్రాతృత్వం. ఇది చాలా కష్టసాధ్యమైన సూత్రం. ఈ సౌభ్రాతృత్వాన్ని సాధించడం చాలా కష్టం. బహుజన ల్లో ఎన్నో ఉప కులాలతో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్న బహుజనల్లోని భిన్నమైన కులాల వారందరం సోదరులం. వీరంతా ఒకే మార్గంలో నడవాలనేది కొంచెం శ్రమతో కూడిన పనే. బహుజన ల ముందు ఉన్న కర్తవ్యాల గురించి రకరకాల ఆలోచనలు చేద్దామా? నమ్మకంతో ముందుకు నడుద్దామా? ఇంకా అవే ఆలోచనలు చేద్దామా? ఇలానే వేచి చూద్దామా? అనే సంకోచం వద్దు. ధైర్యం, ఐక్యత, ఆలోచనతో బహుజన సంఘాల నాయకత్వం ముందుకు సాగాలి. బహుజన్లోని భిన్నమైన కులాల ఐక్యతను చాటాలి. చట్టబద్ధమైన రాజ్యాధికారాన్ని సాధించి భవిష్యత్ భారత రాజ్యాధికారం మాదేనని గర్వంగా చెప్పుకునే స్థాయికి బహుజన సంఘాల నాయకత్వం ఎదగాలని ఆశిద్దాం అనీ రవి రాఘవేంద్రరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాస్ ఇన్ ఏపీ జిల్లా అధ్యక్షుడుచంద్రహాస ,బాస్ ఇన్ ఏపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మీజూరు మల్లికార్జునరావు, మన పాటి,చక్రవర్తి,చలపతి రావు,ముత్తవల్లి ల నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ కాలేషా,అబ్దుల్ రెహమాన్,షేక్ కాలేషా,మణి, బాస్ ఇన్ ఏపీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గున్నారు.
Comments are closed.