The South9
The news is by your side.
after image

పొత్తుపై ముందు జాగ్ర‌త్త‌లో బాబు.

post top

సౌత్ 9 ప్రతినిధి

Post Inner vinod found

పొత్తుపై ముందు జాగ్ర‌త్త‌లో బాబు

కేంద్రం జ‌మిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది. దానికి అనుగుణంగా ఎన్డీఏ భాగస్వామి కూటములు కూడా జ‌మిలీపై మంత‌నాలు సాగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుజ‌మిలి ఎన్నికలకు తన మద్దతును తెలిపారు. – గత ఎన్నికల్లో జనసేన బిజెపితో కలిసి ఎన్నికల్లో ఘ‌ప విజయం సాధించిన చంద్రబాబు నాయుడు వ‌చ్చే జ‌మిలి ఎన్నికలనాటికి కూడా త‌మ మధ్య పొత్తు అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.అందుకు అనుగుణంగానే ఎమ్మెల్యేల సమావేశంలో తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. భాగస్వామ్య పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు గత ఎన్నికల్లో జనసేన బిజెపికి తగిన ప్రాధాన్యం ఇచ్చిన చంద్ర‌బాబు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కూటమిలో బిజెపి చేర‌డానికి పవన్ కళ్యాణ్ కృషి చాలా ఉందని ప్రకటించారు అలాగే మోడీ కేంద్రంలోనూ గుజరాత్ లోను వ‌రుస విజయాలు సాధించడానికి కారణాలను తన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివరించి చెప్తున్నారు ఇలా తనకు వచ్చే ఎన్నికల్లో మరల జనసేన బిజెపితో పొత్తు ఇష్టమేనని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ సైతం స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు మరింత ప్రాధాన్యం ఉంటుందని తమ పార్టీ నేతలకు తెలియజేస్తున్నారు. వీటన్నిటిని చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి టిడిపి జనసేన బిజెపి పొత్తు అనివార్యంగా కనిపిస్తోంది జ‌మిలి ఎన్నికల‌ నాటికి తమ మధ్య అనుబంధం మరింత బలీయంగా ఉండేందుకు చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. బిజెపి జనసేనల ఉద్దేశం కూడా దీన్ని బలపరిచేటట్టుగా ఉంది వారు కూడా జ‌మిలి ఎన్నికల్లో టిడిపి తో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నాయి. మొత్తానికి జ‌మిలి ఎన్నికలు చిత్రాన్ని మరింత ముందుగా ఆవిష్కరించడానికి రంగం సిద్ధమవుతోంది.కేంద్రం జ‌మిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది

Post midle

Leave A Reply

Your email address will not be published.