The South9
The news is by your side.
after image

నాడు నేడు పై ప్రతి నెలా ఆడిట్: ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్.

*12-09-2022*
*అమరావతి*

నాడు నేడు పై ప్రతి నెలా ఆడిట్

విద్య శాఖ పై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయ

నాడు-నేడు కింద పనులు పూర్తి అయినా స్కూళ్లపై ప్రతి నెలకు ఒకసారి ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశం

పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి

*విద్యా కానుకపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు*

వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కిట్లు ఖచ్చితంగా అందాలన్న సీఎం

Post midle

స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశం

పాఠశాలను ప్రతివారం వెల్ఫేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శన, నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించాలి

Post Inner vinod found

స్కూళ్ల నిర్వహణలో వారి దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్‌లతో సహా ముగ్గురు సచివాలయ సిబ్బంది అప్‌లోడ్‌ చేయాలి

మండల స్థాయి అధికారులు వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

మండల స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలన్న సీఎం

తరగతి గదులను డిజిటలీకరణ చేసే క్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

*వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ జరగేలా చూడాలన్న సీఎం*

*డిజిటలైజేషన్ కోసం రూ. 512 కోట్లు పైగా ఖర్చు అవుతుందని అంచనా*

*అన్ని స్కూళ్లు, డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం*

గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించిన సీఎం

వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించి వాటిని అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

Post midle

Comments are closed.