The South9
The news is by your side.
after image

ఉద్దేశపూర్వకంగానే జిల్లాలో పోలీసులపై దాడులు, అల్లర్లు సృష్టించారు :డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి:

 

*పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి క్రూరత్వం – డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి*

 

ఉద్దేశపూర్వకంగానే జిల్లాలో పోలీసులపై దాడులు, అల్లర్లు సృష్టించారు*

 

*పోలీసులపై దాడులకు పాల్పడిన వారిని చట్టపరమైన చర్యలు – ఎస్పీ రిశాంత్ రెడ్డి*

 

 

Post Inner vinod found

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను విచక్షణా రహితంగా బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్ళతో దాడి చేసి వారిని గాయపరచడం ఎంతో క్రూరత్వం అని అనంతపురం రేంజ్ డి.ఐ.జి. ఆర్.ఎన్.అమ్మి రెడ్డి పేర్కొన్నారు. అనుమతి లేని మార్గంలో రావడానికి ప్రయత్నించి శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులపై దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించిన వారిని ఎవరిని వదిలిపెట్టమని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తెలిపారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదన్నారు. వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నెల 4వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు కార్యక్రమం నేపద్యంలో జరిగినటువంటి విధ్వంస చర్యలపై చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో అనంతపురం రేంజ్ డి.ఐ.జి. ఆర్.ఎన్.అమ్మి రెడ్డి, చిత్తూరు ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, మాట్లాడారు. ఈ సందర్బముగా డి.ఐ.జి. అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా అకస్మాతుగా మార్చుకొని పుంగనూరులోనికి చంద్రబాబు ప్రవేశించాలని ప్రయత్నించారన్నారు. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో కొందరు నాయకులు గొడవకు దిగి వారి విధులకు ఆటంకం కలిగించి అక్కడ ఉన్న బ్యారికేడ్లను తొలగించారన్నారు. అల్లరి మూకలను అదుపు చేసే క్రమంలో స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. స్వల్ప లాఠీ ఛార్జ్ చేసిన వారు అక్కడి నుండి వెళ్ళకుండా పెద్ద పెద్ద రాళ్ళను పోలీసులపైకి విసిరి ప్రాణాలకు సైతం హాని కలిగించే విధంగా చేస్తూ పోలీసు వాహనాలు ద్వంసం చేసి వాటికి నిప్పు పెట్టడం జరిగిందని డీఐజీ పేర్కొన్నారు.

 

పోలీస్ డిపార్టుమెంటు నిష్పక్షపాతంగా ఎల్లప్పుడూ ప్రజల ధన, మన ప్రాణాలు కాపాడటానికి శాంతి భద్రతలు కాపాడడానికి నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. పోలీసులు ఏ పార్టీకి అతీతం కాదన్నారు. కొంతమంది అల్లరి మూకలు పోలీసుల వెంటపడి కర్రలతో దాడి చేశారన్నారు. ఇది చాల దురదృష్టకరమన్నారు. జరిగిన ఈ గొడవలో పోలీసులు అత్యంత సమన్వయం పాటించి వారి వద్ద ఆయుధాలు ఉన్న కూడా తొందరపాటు చర్యలకు లోనుకాకుండా నియంత్రణతో గాయాలపాలైన కూడా తమ విధి నిర్వర్తిస్తూ ప్రజలకు మరియు శాంతి బద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా అల్లరి మూకలను కట్టడి చేయడంలో జిల్లా ఎస్పీ, సిబ్బంది అందరు లా & ఆర్డర్ ను చక్కగా నిర్వహించారన్నారు. ఇంతటి విధ్వంసం జరిగిన పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి కాని ప్రజలకు ఎటువంటి గాయాలు కానీ అవ్వలేదని తెలిపారు.

 

Post midle

జిల్లా ఎస్పీ రిశాంత్‌ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు వారి కార్యక్రమం ప్రకారం పుంగనూరులోనికి రావడానికి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. వారు ఇచ్చిన కార్యక్రమం ప్రకారమే 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసాం. వారు కార్యక్రమం ప్రకారము పుంగనూరులోనికి రాకుండా హైవే పై చిత్తూరు కు వెళ్ళవలసి ఉంది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని తగిన పోలీసు బందోబస్తుతో బ్యారికేడ్లను ఉంచడం జరిగింది. అయిన కూడా కొంతమంది అల్లరి మూకలు దౌర్జన్యంగా పుంగనూరులోకి ప్రవేశించాలని వాగ్వాదానికి దిగారు. కొంతమంది అల్లరిమూకలు ముందుగానే తెచ్చుకున్న బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో పోలీసుల పైకి దాడికి పాల్పడ్డారు. సుమారు 2000 మంది అల్లరి మూకలు చాల అమానవీయంగా దాడి చేసారు. ముందస్తు ప్రణాళిక లో బాగంగానే పోలీసులపై దాడులు జరిగాయి. వారిని అడ్డుకునే క్రమంలో మొదటగా బాష్ప వాయువు ప్రయోగించి వారి పై స్వల్ప లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ అల్లరి మూకలు ఏ మాత్రం తగ్గకుండా పోలీసుల పై ఇష్టమొచ్చినట్టు విచక్షణారహితంగా కర్రలు, రాళ్ళతో దాడి చేసి పోలీసు వారిని తీవ్రంగా గాయపరిచారు. 50 మంది పోలీసులు రాళ్ల దాడిలో గాయపడ్డారు. 13 మంది పోలీసు వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒక కానిస్టేబుల్ కు ఎడమ కన్ను కు గాయమవ్వగా అతని ఎడమ కన్ను చూపు మందగించిడం గమనార్హం. రెండు పోలీసు వాహనాలను ద్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు. ఈ చర్యలో బాగంగా ఇప్పటికే వీడియోల ద్వారా 40మందిని గుర్తించి వారి పై కేసులు నమోదు చేసామని, ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఎవరైతే ఈ అల్లర్లకు పాల్పడ్డారో అందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. గాయాలైన పోలీసులను పుంగనూరు హాస్పిటల్ నుండి మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఈరోజు ఉదయం డి.ఐ.జి, ఎస్పీ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి గాయాలపాలైన వారికి అందరికి 10,000 రూపాయలను అందించి వారు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Post midle

Comments are closed.