బెంగళూరు ప్రతినిధి: దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరగడంతో మూడో దశ మొదలైందని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి కె .సుధాకర్ బెంగళూరు లో విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. మంత్రి మాట్లాడుతూ… గత ఆరు నెలలుగా పాజిటివ్ రేట్ 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతం పెరిగిందని , ఇది మూడో దశ కి సంకేతమని అన్నారు. బెంగళూరులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మైక్రో కంటోన్మెంట్ జోన్ లు చెయ్యాలని ముఖ్య మంత్రి తో చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు రెడ్ జోన్ లో ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంక్రాంతి తర్వాత మూడో దశ మొదలవుతుందని కుంటే ముందుగానే ప్రారంభమైందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. అలానే కాంగ్రెస్ నేతలు చేపట్టదలచిన పాదయాత్ర ని విరమించుకోవాలని సూచించారు.
Comments are closed.