The South9
The news is by your side.
after image

ఆరోగ్యశ్రీ 2.0: ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం: సీఎం జగన్‌

 

*తేది : 18-12-2023*
*స్థలం :తాడేపల్లి*

*ఆరోగ్యశ్రీ 2.0: ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం: సీఎం జగన్‌*

*పేదవాడికి మెరుగైన కార్పొరేట్ వైద్యం మరింత చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్‌*

*వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు తెచ్చాం*

*రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ*

*గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 53,126 మంది (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌)ని రిక్రూట్‌ చేశాం*

Post midle

‘‘డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడూ, ఎవరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చాం. ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్‌తో పాటు దిశ యాప్‌ కూడా ఇన్‌స్టాల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సీఎం జగన్‌ సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెల్త్‌ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం. వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం” అని సీఎం జగన్ అన్నారు.

*నేటి నుంచి ప్రారంభం*

Post Inner vinod found

ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుందని సీఎం తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఆరోగ్య వివరాలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఆరోగ్యశ్రీ మార్పుల విప్లవాత్మకమైన మార్పులని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, పార్లమెంట్‌ స్థానానికి ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామిని వివరించారు. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యమని, పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం అని పేర్కొన్నారు.

*ప్రతీ ఇంటా ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి*

ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పేషెంట్‌ వివరాలు అన్నీ డాక్టర్లకు తెలుస్తాయిని చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదని అధికారులను ఆదేేశించారు. ఇప్పటికే డోర్‌ డెలివరీకి సంబంధించి ట్రయల్‌ రన్‌ స్టార్ట్‌ చేశామని, ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పారు.

“మనం అధికారంలోకి రాకముందు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. మనం అధికారంలోకి వచ్చిన తరువాత చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదు.. అటువంటివన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి.. ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదనే తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తూ ప్రొసీజర్స్‌ను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం.. తరువాత 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ నడిపిస్తున్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 ఆస్పత్రులకు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2,309 ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని 85 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎంప్యానల్‌ చేశాం. బెంగళూరులో 35 ఆస్పత్రులు, చెన్నైలో 16 ఆస్పత్రులు.. మొత్తంగా 204 ఇతర రాష్ట్రాల్లోని నగరాలను ఎంప్యానల్‌ చేసి, గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాల్లోని సూపర్‌ స్పెషాలిటీ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. గతంలో కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే, కేవలం హైదరాబాద్‌లో 72 ఆస్పత్రుల్లో మాత్రమే పరిమితమై ఉండేది. రెండు కలిపినా కూడా కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని నేడు.. ఏకంగా 2,513 ఆస్పత్రులకు విస్తరింపజేశాం” అని సీఎం వివరించారు

*గత ప్రభుత్వం నిర్లక్ష్యపరచిన మీ బిడ్డ ప్రభుత్వం వైద్య రంగ రూపురేఖలు మార్చింది*

రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, కాన్సర్‌లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్య శ్రీ వర్తింపజేశామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 104,108 వాహనాలు కూడా సరిగ్గా వచ్చేవి కావని, ఇవాళ ఏకంగా 104 ,108 కింద 2,200 వాహనాలు తిరుగుతున్నాయని వివరించారు. గతంలో మండలానికి ఒక 104,108 కూడా లేని పరిస్థితి ఉండేదని, గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితని, ఇవాళ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామి చెప్పారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదని, అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచామని అన్నారు. గత ప్రభుత్వం రూ.5 లక్షలు కూడా ఇచ్చేది కాదని, జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత 61శాతం ఉంటే.. రాష్ట్రంలో 3.3శాతం మాత్రమే స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత ఉందని, వీటినికూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ సేవలను మెరుగు పరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి రూ.4,400 కోట్లు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బందిపాలు కాకూడదు, అప్పులపాలు కాకూడదనే తపన, తాపత్రయంతో చేశాం.
గతంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు తక్కువే. గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్నవారి సంఖ్య 22.32 లక్షల మంది మాత్రమే. మనందరి ప్రభుత్వంలో నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు 53 లక్షల మందికి అందుబాటులోకి వచ్చాయి.

*రెండోవ దశ ఆరోగ్య సురక్ష ప్రారంభంకానుంది*

జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష ఫేస్‌–2 మొదలవుతుందని సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ఆరు నెలలకు ఒకసారి మెగా హెల్త్‌ క్యాంప్‌ రిపీట్‌ అవుతుందని, ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 కింద ప్రతి మండలంలోనూ, ప్రతి వారం ఒక గ్రామంలో హెల్త్‌ క్యాంపు జరుగుతుందని ప్రతి వారం ఒక మండలంలో మంగళవారం, మరో మండలంలో శుక్రవారం జరుగుతుందని, వార్డుల పరిధిలో ప్రతి బుధవారం క్యాంపు జరుగుతుందని తెలిపారు.

ఫేస్‌–1 ద్వారా 50 రోజులు కార్యక్రమం నిర్వహించామని, దీని వల్ల దాదాపుగా 60,27,843 మంది హెల్త్‌ క్యాంపులకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్లి 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగిందని, ప్రివెంటీవ్‌కేర్‌లో కొత్తగా 2.40 లక్షల మందికి బీసీ లక్షణాలు కల్పించాయని, రీకన్ఫర్‌మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా ఇవ్వడం జరిగిందని, 1,48,904 మందికి డయాబెటిస్‌ ఉన్నట్లు ధ్రువీకరణ జరిగిందని ఇందులో రీకన్ఫర్‌మేటరీ టెస్టులు కూడా అయిపోయి.. 39,684 మందికి మందులు కూడా స్టార్ట్‌ చేశామని వివరిరంచారు. ఆరోగ్య సురక్ష చాలా ప్రాముఖ్యత కలిగినదని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనే వారి ఫోన్‌లకు 6 నిమిషాల వీడియో కూడా పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుదారులందరికీ పూర్తి అవగాహన కల్పించే వీడియో మెసేజ్‌ను చూపించాలని, వీడియో మెసేజ్‌ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయని, వారికి ఆ వీడియో మెసేజ్‌ పంపిస్తే ఎప్పుడైనా వినాలనుకున్నప్పుడు వింటారని సీఎం ఈ ప్రక్రియను వివరించారు.

Post midle

Comments are closed.