అమరావతి: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అధారిటీ (పీ సి ఏ) చైర్మన్ గా జస్టిస్ కనకరాజు ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను తొలగిస్తూ కనగరాజు ని నియమించింది రాష్ట్రప్రభుత్వం. అయితే కనకరాజు నియామకం సరికాదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా ఆయన నియామకాన్ని కొట్టివేస్తూ నిమ్మగడ్డ నే ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అధారిటీ చైర్మన్ ఆయన కు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అధారిటీ లో ఒక్క రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లు సభ్యులుగా ఉంటారు. వీరి ఎంపిక మాత్రం పూర్తి కావాల్సి ఉంది. పోలీసులు ఎవరైనా ప్రజలు ఫిర్యాదు స్వీకరించక పోయినా, సరైన న్యాయం చేకూర్చే లేదని అనుమానం కలిగిన వీరిని ఆశ్రయించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ ఆధార్ టి రూల్స్ 2020 లోని సెక్షన్ 4ఏ ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జి ని చైర్మన్ గా నియమించాల్సి ఉంటుంది . 65 ఏళ్ల వయసు దాటిన వారు ఈ పోస్టులో కొనసాగడానికి వీల్లేదని ప్రస్తుత చైర్మన్ కనగరాజు వయసు దాదాపు75 సంవత్సరాలని సర్వీస్ రూల్స్ ప్రకారం ఇది విరుద్ధం అని కొంతమంది విమర్శిస్తున్నారు.
Comments are closed.