ఏఐఎస్ఎన్పీఎఫ్ అనుబంధంగా ఏపిజేయూ
– త్వరలో ఢిల్లీలో 50వ జాతీయ సదస్సు
– ఏపిజేయూ ప్రెసిడెంట్ వెంకటవేణు
ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సంస్థతో తమ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపిజేయూ) సంస్థ అనుబంధ సంస్థగా ఏర్పడిందని ఏపిజేయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే వెంకట వేణు అన్నారు. గురువారం విజయవాడలో జరిగిన ఏపిజేయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకట వేణు మాట్లాడారు. ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ ( ఏఐఎస్ఎన్పీఎఫ్, న్యూ ఢిల్లీ) జాతీయ సంస్థతో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపిజేయూ) సంస్థ అనుబంధంగా ఏర్పడటం పై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఏఐఎస్ఎన్పీఎఫ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్లో ఏఐఎస్ఎన్పీఎఫ్ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సు వివరాలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చాలామందికి ఎడిటర్స్, జర్నలిస్టుల అక్రిడిటేషన్లు మంజూరు కాకపోవడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. అప్పటికి అర్హులైన వారికి అక్రిడిటేషన్లు ఇవ్వకపోతే వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని అన్నారు. ఏపీజేయూ సంఘంలోని సభ్యులందరికీ ఆరోగ్య భీమాను కల్పిస్తామన్నారు. ఏడిటర్స్ ఎదుర్కొంటున్న ఆర్.ఎన్.ఐ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులు, ఎడిటర్స్ పై జరుగుతున్న దాడులను వెంకట వేణు ఖండించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టులకు జర్నలిస్టులపై
హింసా వ్యతిరేఖ, నేరాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏపిజేయు రాష్ట్ర ప్రెసిడెంట్ ఎస్ సిద్ధార్ద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి శేఖర్ బాబు, ఉపాధ్యక్షులు యన్ హేమ సుందర్, సుబ్బాచారి, రాష్ట్ర కార్యదర్శి మనపాటి చక్రవర్తి, సహాయ కార్యదర్శి యు మురళీ, కోశాధికారి కృష్ణ ప్రసన్న, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కృష్ణ భగవాన్, రాష్ట్ర సభ్యులు సురేష్ తదితరులు ఉన్నారు.
Comments are closed.