The South9
The news is by your side.
after image

దివంగత మంత్రి మేకపాటికి సంతాప నివాళి పలికిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ

చిరస్థాయిగా గౌతమ్ పేరు నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి “మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ”గా పేరు పెడతాం  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా శాశ్వతంగా నిలిచపోయేలా బ్యారేజీకి పేరు పెడతాం

వెలిగొండ ప్రాజెక్టును ఉదయగిరి ప్రాంతానికి రెండు దశలు కాకుండా ఒకే దశలో పూర్తి చేయాలని రాజమోహన్ రెడ్డి అన్న ఎమోషనల్ గా అడిగారు. దాన్ని పూర్తి చేస్తాం

ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వసతులను మెరుగుపరిచేందుకు రెండో దశ నాడు నేడు పనుల ద్వారా వేగంగా పూర్తి చేస్తాం, అగ్రికల్చర్ యూనివర్శిటీగా మారుస్తాం

మంచివాడైన మంత్రి గౌతమ్ పైలోకంలో కూడా సంతోషంగా ఉండాలని, ఉంటాడని కోరుకుంటున్నా

మేకపాటి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది

Post midle

ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం బ్యారేజ్ 6 వారాల్లో పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 

అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి సంతాపం తెలిపిన శాసనసభ్యులు

 

తల్లిదండ్రులు ఏరికోరి గౌతమ్ అని పేరు పెట్టారేమో : స్పీకర్ తమ్మినేని సీతారామ్

గౌతమ బుద్ధునిలోని లక్షణాలన్నీ మన గౌతమ్ లో ఉన్నాయి : స్పీకర్

మంచితనం, మానవత్వం, ప్రశాంతమైన రూపం, సున్నితంగా మాట్లాడే గుణం వంటి లక్షణాలన్నీ గౌతమ్ లో ఉన్నాయి : స్పీకర్ తమ్మినేని సీతారామ్

శాసనసభలోకి గౌతమ్ నడుచుకుంటూ వస్తుంటే టార్జన్ (ఆజానుబాహుడు) వస్తున్నట్లే అనిపించేది

శాసన సభలోకి రావడం దగ్గర నుంచి సభ సమాప్తమయ్యేవరకూ చెరగని చిరునవ్వు, ఉత్సాహం అలాగే ముఖంలో ఉండేవి

ఎంతెదిగినా ఒదిగి ఉండే గుణం అన్న మాటకి నిలువెత్తు రూపం, ఆయన సీటు వైపు చూస్తే చాలా వెలితిగా ఉంది

పరిశ్రమల మంత్రిగా గౌతమ్ ఎంపిక పట్ల ముఖ్యమంత్రిని మనసులో వందల సార్లు అభినందించేవాడిని : స్పీకర్ తమ్మినేని సీతారామ్

శ్రీకాకుళం జిల్లాలో టెక్స్ టైల్ మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ కోసం వేగంగా చర్యలు తీసుకున్నారు

చనిపోయి సజీవంగా ఉండే వ్యక్తి గౌతమ్

రూ.100 కోట్లతో వచ్చే ఆ ప్రాజెక్టు కోసం ఎంతో తపించారు : : స్పీకర్ తమ్మినేని సీతారామ్

మనుషులొస్తుంటారు , పోతుంటారు..కానీ, ఆయన చేసిన పనులు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటాయి. మంత్రి మేకపాటి సేవలు కూడా చిరకాలం గుర్తుంటాయి.

 

వైఎస్ఆర్ కుటుంబానికి మేకపాటి కుటుంబ సభ్యులంతా భక్తులు : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

వైఎస్ కుటుంబం వల్లే మేం సాధించిందేదైనా, వైఎస్ కుటుంబం గీచిన గీతను మేకపాటి కుటుంబం ఏనాడు దాటదు : ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి

సీఎం జగన్ క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి వచ్చాక, అడుగడుగునా గౌతమ్ ఉన్నాడు : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

బాబాయ్ జగన్ అన్న కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గౌతమ్ అడగ్గానే, కచ్చితంగా చేస్తానన్నాను, చేశాను : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

వైఎస్ఆర్ తో నా కుటుంబంలో నాకు ప్రత్యేకమైన అనుబంధం

1000 మందికి ఉద్యోగాలిచ్చే ఒక్క పరిశ్రమను ఉదయగిరిలో పెట్టాలయ్యా అని తరచూ గౌతమ్ ని అడిగేవాడ్ని, ముఖ్యమంత్రితో మాట్లాడి కచ్చితంగా చేస్తానని గౌతమ్ చెప్పేవారు : ఎమ్మెల్యే మేకపాటి

గౌతమ్ మరణం పట్ల సంతాపం చెప్పే రోజు రావడం దుర్మార్గకరం, అత్యంత దు:ఖించే సమయం, మా మేకపాటి కుటుంబానికి గౌతమ్ లేని లోటు కోలుకోలేని లోటు

ఇక మెట్టప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల బాధ్యత ముఖ్యమంత్రిదే : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

 

మంత్రి మేకపాటి తపన ఆదర్శం : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

స్వతహాగా ఆయన శ్రీమంతుడు కానీ, ఆయన సకల గుణాల సంపన్నుడు : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

కుటుంబ నరకయాతన, వేదనను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు

చాపర్ లో గౌతమ్ పార్థివదేహం పక్కన కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడం చూసి నాలో నేను చాలా వేదనకు లోనయ్యాను

పారిశ్రామిక పాలసీ, పరిశ్రమల స్థాపనలో తన వంతు పాత్ర పోషించే వరకూ ఆఖరి వరకూ తసన పడ్డారు : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకుడైతే…మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సైనికుడు, నిజమైన సైనికుడు : నగరి ఎమ్మెల్యే రోజా

మంత్రి మేకపాటి వంటి మనసున్న వ్యక్తి, గొప్ప మనిషి గురించి సంతాపం వ్యక్తం చేసే రోజొకటి వస్తుందని ఊహించలేదు : రోజా

సొంత చెల్లిలా భావించి ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ప్రయత్నించేవారు : రోజా

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా గౌతమ్ అన్న పనితీరుని దగ్గర నుంచి చూశాను : రోజా

గౌతమ్ అన్న చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉండడం వల్ల నా నియోజకవర్గం సమస్యలను పలుమార్లు ఆయనతో సంప్రదించాను, పరిష్కారానికి పరితపించేవారు : రోజా

కేబినెట్ బాహుబలి అని, నెల్లూరు జిల్లా టైగర్ అని, ఆత్మకూరు నియోజకవర్గం ఆరడుగుల బుల్లెట్ లా పిలుచుకునేవారు : రోజా

చేసే ప్రతి పనిలో ముఖ్యమంత్రి జగన్ అన్ననే స్ఫూర్తిగా తీసుకునేవారు గౌతమ్ అన్న : రోజా

వైఎస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి లాగే తల్లిదండ్రుల బాటలో వారసులుగా సీఎం జగన్, మంత్రి గౌతమ్ లు కలిసి నడిచారు : రోజా

ఏ పనైనా, ఎంతటి బాధ్యతనైనా అవలీలగా నిర్వర్తించేవారు గౌతమ్ అన్న : రోజా

 

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మునుపెన్నడూ చేయని విధంగా త్వరలో తన సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం పలకాలి, అందుకు మీ తోడ్పాటు కావాలని అడిగేవారు : చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

మంత్రి గౌతమ్ అన్న లేకపోవడం నమ్మలేని నిజం : చెవిరెడ్డి

సీఎం గారంటే అమితమైన ప్రేమ

డీఆర్సీ, జిల్లా పరిషత్ మీటింగ్ ఏది జరిగినా ప్రతి అంశంపైనా చర్చించేవారు

జిల్లాని ఏకతాటిపైన ముందుకు తీసుకువెళ్లేందుకు సర్వప్రయత్నాలు చేశారు దివంగత మంత్రి మేకపాటి : సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంతాలను అన్ని విధాల డెవలప్ చేయాలనుకుని ప్లాన్ లు వేశారు : కిలివేటి సంజీవయ్య

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, నాకు సోదరుడు ఇక లేరంటే చాలా బాధాకరంగా ఉంది : కిలివేటి సంజీవయ్య

 

బడ్జెట్ సమావేశాలలో నా పక్కనే కూర్చేనే గౌతమ్ అన్న ఇపుడు లేరంటే తట్టుకోలేకపోతున్నా : జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డన్న గౌతమ్ అన్న మరణవార్త తెలియబరచగానే చాలాసేపు నేను తేరుకోలేకపోయా

నాకు అత్యంత సన్నిహితుడు, నా సోదరుడు గౌతమ్ అన్న

Post Inner vinod found

గత 12 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని మనిషి గౌతమ్ అన్న ఒక్కరే

ఎంతో దగ్గరగా చూసినా నేనేనాడూ ఆయన కోపాన్ని చూడలేదు

రాజకీయాలలో, తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్యవంతుడు గౌతమ్ అన్న 50 ఏళ్లకే దూరమవడం నమ్మలేకపోతున్నాం

ఏ మాత్రం ఇగో లేని నాయకుడు గౌతమ్ అన్న : అనిల్ యాదవ్

కుళ్లు, కుతంత్రాలంటే ఏంటో తెలియని వ్యక్తి గౌతమ్ అన్న : అనిల్ యాదవ్

అన్నింట్లోనూ నా కన్నా మిన్న గౌతమ్ అన్న, తాను నా వెనకే ఉండి నన్నే ముందుండి అన్నీ చూసుకోమని ప్రోత్సహించేవారు

గౌతమ్ గురించి 21వ తేదీ ఉదయం ఆరోగ్యం బాగాలేదనే వార్త తెలియగానే తిరిగివస్తారని అనుకున్నా : నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్

గౌతమ్ నేను ఎన్నో విషయాలు వైసీపీ గురించి చర్చించేవాళ్లం

రైతులు, సాధారణ ప్రజల కోసం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం

ఎవరైనా విమర్శించినా తిరిగి అనాలని అనుకోని వ్యక్తి

ప్రతి బాధ్యతను 100శాతం నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు

గౌతమ్ లేని లోటును తట్టుకునే మనోధైర్యం ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఇవ్వాలి : కాకాణి

 

బంగారం లాంటి మనిషిని, మంత్రిని కోల్పోయామంటే నమ్మలేకపోతున్నా : విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సోమశిల సోమేశ్వర ఆలయాన్ని బాగా నిర్మించాలని చాలా తపన పడ్డారు

మంత్రిగారి కల అయిన సోమశిల ఆలయాన్ని పూర్తి చేయాలని గౌతమ్ తరపున సీఎంకి విన్నవిస్తున్నా

అన్న జగన్ అన్నకు నేను చెప్తాను, మీరు కూడా ఆయనకి ఓ మాట చెప్పండని కోరేవారు

వాసన్న అంటూ ప్రతి 2,3 రోజులకోసారి ఫోన్ చేసి నెల్లూరు ఇంచార్జి మంత్రినైన నాతో ఎన్నో విషయాలు చర్చించేవారు : బాలినేని

గౌతమ్ తో నాకున్న అనుబంధం వల్ల నా భార్య ఆయన మరణవార్తని చెప్పడానికి తర్జనభర్జన పడి చాలా సేపటికి చెప్పింది

వర్షాల సమయంలో నియోజకవర్గమంతా మీతో కలిసి తిరగాలనుకుంటున్నా అంటూ ప్రతి సందులో కలియతిరిగారు గౌతమ్ : బాలినేని

ముఖ్యమంత్రిగారికి మంత్రి గౌతమ్ అంటే ఆప్తుడు, ఆత్మీయుడు, నమ్మకస్తుడు : బాలినేని

గౌతమ్ లాంటి సరైన మనిషికి సీఎం సరైన బాధ్యతలు ఇచ్చారు

 

సోమశిల పూర్తి మంత్రి మేకపాటి కల : ఆనం రాంనారాయణ రెడ్డి

గౌతమ్ రెడ్డి లేని సభను , సంతాప సభగానూ జీర్ణించుకోలేకపోతున్నా

వివాదాస్పద రాజకీయాలు తాండవమాడే పరిస్థితులలో గౌతమ్ వివాదరహితుడుగా విధులు నిర్వర్తించారు

నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి చాలా సార్లు చర్చించారు

2022 జనవరి 3,4 తేదీలలో మేం కలుసుకున్నప్పుడు వ్యవసాయ ప్రగతిపై చాలా మాట్లాడారు

జిల్లా నాయకులందరం కలిసి ముఖ్యమంత్రిని కలిసి ముందుకుసాగాలని కలలుగన్నారు

ఆత్మకూరులో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుకు పురుడు పోసి గౌతమ్ అశువులు బాసారు

శ్రీకాళహస్తి, నడకుడి జాతీయ రహదారి, రైల్వే లైన్ లతో సింహపురిని సమగ్రంగా ఎంతో ముందుకు తీసుకువెళ్లాలనుకున్నారు

నెల్లూరు జిల్లా నాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి, ఐక్యతకు ముఖ్యమంత్రి సూచనల మేరకు చాలా ప్రయత్నాలు చేశారు

సోమశిల ప్రాజెక్టును ముఖ్యమంత్రి యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసి గౌతమ్ స్వప్నాన్ని సీఎం నిజం చేయాలి

ఆత్మకూరులో 65శాతం, మిగతా పరిధి నా నియోజకవర్గంలో సోమశిల ఉండడం వల్ల తరచూ చర్చించేవాళ్లం

 

కోవిడ్ లో కూడా కష్టపడిన వ్యక్తి గౌతమ్ అన్న : దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎగుమతులలో నంబర్ వన్ గా నిలబెట్టిన గౌతమ్ అన్న : అబ్బయ్య చౌదరి

ఐ.టీ పాలసీ గురించి నేను కూడా పలుమార్లు ఆయనతో చర్చించాను, ఐ.టీ సంస్థల సీఈవోలతో జరిగిన ఐ.టీ సీఎక్స్ వో సదస్సులో భాగస్వామ్యం అయ్యాను : అబ్బయ్య చౌదరి

దుబాయ్ ప్రతినిధులు మంత్రి మేకపాటి హుందాతనం, వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రశంసించారు : అబ్బయ్య చౌదరి

విశాఖలో నాస్కామ్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు కోసం ఎంతగానో తపన పడ్డారు : అబ్బయ్య చౌదరి

 

జగన్ గారికి మంత్రి మేకపాటి ట్రూ సోల్జర్ : కర్నూలు నియోజకవర్గ శాసన సభ్యులు హఫీజ్ ఖాన్

కోవిడ్ సమయంలో వెబినార్లు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి చాలా శ్రమించారు

రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి ఎమ్ఎస్ఎమ్ఈలను ఆదుకోవడంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించి, దేశంలోనే మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలిపారు : హఫీజ్ ఖాన్

ప్రతి సమావేశంలో ఆయన ఏదో ఒక ప్రత్యేకతని ప్రదర్శించేవారు : హఫీజ్ ఖాన్

ఆయన ప్రతి మీటింగ్ చివర్లో యూ గ్రో వి గ్రో అనే నినాదం పారిశ్రామికవేత్తలతో పలకడం జీవితంలో మరచిపోలేను : హఫీజ్ ఖాన్

ఎంతో కష్టపడుతున్నా ట్రోల్ చేయడాన్ని ఆయనకు చెబితే మనం మాట్లాడనవసరం లేదు , మన పనితోనే వారికి సమాధానం చెబుదాం అని చాలా సాధారణంగా తీసుకున్నారు

గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ లో షర్ట్ మీద చేయితో రుద్దుకోవడాన్ని మేనరిజంలా భావించకుండా దాన్ని కూడా తప్పుడుగా చిత్రీకరించాలనుకున్నారు : హఫీజ్ ఖాన్

సీఎం ప్రత్యేక సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాదిలను ఆయన మెచ్చుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు

ముఖ్యమంత్రిగారిని కలిసి మనం పడ్డ శ్రమని, కష్టాన్ని చెప్పాలని చాలా ఎక్సైట్ గా కనిపించారు

వారం రోజులుగా ఎంతో దగ్గరగా చూసిన ఆయన ఇపుడు లేరంటే నమ్మశక్యంగా లేదు : హఫీజ్

 

2012లో రాజకీయాలకు నేను కొత్త, అపుడు మన సీఎం గారు తిరుపతి ఎంపీ సీటు ఇచ్చి, ఓవ్యక్తిని కలవమన్నారు, ఆయన మరెవరో కాదు మన మంత్రి గౌతమ్ రెడ్డి : గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్

ఆఫీస్ కి ఎవరొచ్చినా ముందుగానే ఎదురొచ్చి పలకరించే సంస్కారం గౌతమ్ ది : వరప్రసాద్

ఎంపీగా నా బాధ్యతలు పూర్తై ఎమ్మెల్యేగా మారిన ఈ 3 ఏళ్లు కూడా నన్ను ఎంపీగారు అనే పిలిచేవారు : వరప్రసాద్

దసపల్లా హోటల్ లో జిమ్ కి వెళ్లాను, ఆజానుబాహుడిలా చాలా చురుగ్గా, వేగంగా జిమ్ చేస్తున్న గౌతమ్ కసరత్తులు చూసి ఆశ్చర్యపోయాను : వరప్రసాద్

ఆయన వ్యక్తిత్వమే కాదు, భౌతికంగా కూడా చాలా క్రమశిక్షణ, దేహాన్ని విలువైన సంపదగా చూసేవారు : వరప్రసాద్

Post midle

Comments are closed.