The South9
The news is by your side.
after image

త్వరలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం!

అమరావతి :

Post Inner vinod found

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు విషయంలో సానుకూలంగా స్పందించే విధంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమయింది. ఈ సమావేశంలో సినిమా రంగానికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వివిధ వర్గాల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను స్వీకరించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రాంతాల వారీగా నా, థియేటర్ల పరిస్థితిని బట్టి ధరలు నిర్ణయించాల అనే విషయాన్ని చర్చించి నిర్ణయించాలని తెలుస్తోంది. ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ప్రముఖ నటుడు చిరంజీవి కలిసిన నేపథ్యంలో టికెట్ల వ్యవహారం గురించి చర్చించి నట్లు సమాచారం. ఆ సమావేశం సానుకూలంగా జరిగిందని చిరంజీవి చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని సినీ రంగ ప్రముఖులు అనుకుంటున్నారు. అలానే పెద్ద చిత్రాల విడుదల దగ్గర్లో ఉండడంతో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Post midle

Comments are closed.