ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్షంగా ఫిర్యాదుల కోసం నూతన అప్లికేషన్ 14400 ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది: డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
*ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్షంగా ఫిర్యాదుల కోసం నూతన అప్లికేషన్ 14400 ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది: డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి*
అవినీత పై ఫిర్యాదు చేసేందుకు ఈ అప్లికేషన్ 14400ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ , ఐఓఎస్ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మొదటగా OTP నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిర్యాదుదారులు ఈ అప్లికేషన్ ద్వారా రెండు విధాలుగా ఫిర్యాదు చేయవచ్చు. మొదటిది లైవ్ స్ట్రీమింగ్, రెండోవాది ఆడియో, వీడియోను రికార్డు చేసి పంపే సౌకర్యాన్ని కల్పించింది. అంతే కాకుండా గతంలో జరిగిన ఆవితిపైన సైతం ఫిర్యాదు చేసే విధంగా ఈ అప్లికేషన్ ను రూపొందించడం జరిగింది. ఈ రెండు విధానాల ద్వారా అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, పనిచేస్తున్న శాఖతో కూడిన పూర్తి వివరాలను పొందుపరిచి పంపినట్లైతే దీనిపైన తక్షణమే అవినీతి నిరోదక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
Comments are closed.