గద్వాల్ ప్రతినిధి: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా గ్రామ స్థాయిలో విస్తరిస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్ర నాయకులు ఉధృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లాలోని మనపాడు గ్రామంలో స్థానిక నాయకులు రాజశేఖర్ శర్మ, గొల్ల విజయ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు బంగారు శృతి ,గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిగ్ద రెడ్డి పాల్గొన్నారు. బంగారు శృతి మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం మాటలే చెప్తుంది కానీ చేతల్లో ఏమి చూపించడం లేదు అని అన్నారు, అధికార పార్టీ వ్యతిరేక నిర్ణయాల వల్ల చాలామంది ఈరోజు బిజెపి పార్టీలో చేరడం ఆనందదాయకం అని తెలుపుతూ …తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటించి పార్టీని బలోపేతం చేసి, ఈ రాష్ట్రంలో బిజెపి పార్టీ ని అధికారంలోకి తీసుకుని వచ్చే నరేంద్ర మోదీ కి అంకిత మిస్తా మనీ అన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అలానే గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిగ్ద రెడ్డి మాట్లాడుతూ .. ముందుగా నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన అధిష్టానానికి కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ.. బిజెపి పార్టీ ని జిల్లాలో బలోపేతం చేసే విధంగా నా సాయశక్తులా పని చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి గద్వాల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, యువ నాయకులు ఈశ్వర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
Comments are closed.