నెల్లూరు ప్రతినిధి :
స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు ఇవ్వాలి : నెల్లూరు కలెక్టర్ కు ఎడిటర్స్ జేఏసీ వినతి
నెల్లూరు, ఆగస్టు 18:
స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు స్థానిక పత్రికల ఎడిటర్స్ జేఏసీ వినతిపత్రం అందజేసింది. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తిక్కన భవన్ లో స్థానిక పత్రికల ఎడిటర్లు జే ఏ సి గా వెళ్లి కలెక్టర్ ను కలిశారు.
గతంలో ఆర్ ఎన్ ఐ, సి ఏ సర్టిఫికేట్, పత్రికల కాపీల సమర్పణ ఆధారంగా స్థానిక పత్రికల ఎడిటర్లకు అక్రిడిటేషన్లు ఇచ్చేవారని కలెక్టర్ కు తెలిపారు. అయితే ప్రస్తుతం జీ ఎస్ టి నిబంధలతో ముడిపెట్టినందున, జీ ఎస్ టీ పరిధిలోకి రాని స్థానిక పత్రికల ఎడిటర్లు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం వుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టాలలోనూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పత్రికలను నడుపుతున్న స్థానిక పత్రికల ఎడిటర్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా వున్న కలెక్టర్ జీఎస్టీ నిబంధనలను సడలించి మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పత్రికల జే ఏ సి తరఫున ఎడిటర్లు జి. శేఖర్ బాబు, డి. వేణుగోపాల్ రెడ్డి, మల్లు రాజేంద్ర ప్రసాద్, పి. మధుసూదన రావు, జేవీ కామేశ్వర రావు, కే డి వి మల్లికార్జున, సి హెచ్ రమేష్, శ్రీహరి ప్రసాద్, దినేష్ కుమార్, ఎస్ శ్రీనివాసులు, బోస్, రావూరి రమేష్, శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.