అమరావతి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అవుతున్న సందర్భంగా గతంలో చెప్పినట్లు మంత్రివర్గ మార్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కొత్త వాళ్ళని తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ మార్పు జరిగి అందరు మంత్రులు మార్చవలసి వస్తే ఒక మంత్రి మాత్రం కచ్చితంగా కొత్త క్యాబినెట్ లో కూడా ఉండాలని నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో ఒక సందేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది … మీడియా కి చెందిన వాట్సాప్ గ్రూపు లో, అలానే రాజకీయ నాయకులు వాట్సాప్ గ్రూపు లో హల్ చల్ చేస్తుంది…… ఆ సందేశం సారాంశం.…..
*కేబినెట్ లో కచ్చితంగా కొనసాగాల్సిన మినిస్టర్! ఈయన ఒక్కరే!!*
మంత్రులు ఎందరు ఉన్నా ఈ మంత్రి పంథాయే వేరు. ఎవరికి ఎన్ని రూట్లు ఉన్నా ఆయన రూటే సెపరేట్.
విలక్షణం ఆయన లక్షణం. విశిష్టం ఆయన గుణం. వివాదరహితం అతని వ్యక్తిత్వం. వినూత్నం ప్రతీ మార్గం. అవినీతికి ఆమడదూరం. వినయవిధేయతల సమాహారం. ఇక పేరు చెప్పాల్సిన పని లేదు. ఆ స్టైలిష్ మంత్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మరెవరో కాదు మాజీ ఎంపీ, వైసిపి సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి రాజకీయ వారసుడు , తండ్రిని మించిన తనయుడుగా నియోజకవర్గంలో, మంత్రివర్గ మండలిలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి మన్ననలందుకున్న ఏకైక మినిస్టర్.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. విదేశాల్లో బాగా చదువుకున్న వ్యక్తి. అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉన్న మేధస్సు. ఫారెన్ దేశాల్లో పొలిటిషన్ లా స్టైల్, క్రేజ్ ఉన్న స్పెషల్ మినిస్టర్. సబ్జెక్టు వారిగా విమర్శిస్తారే తప్ప ఎవరిని పల్లెత్తు మాట అనకుండా రాజకీయం చేయడం తెలుగు రాజకీయ చరిత్రలోనే ఆయనతో తొలిసారి మొదలైంది. అందుకే విపక్షాలు కూడా ఆయనను విమర్శించడానికి సాహసించరు. ఒక్కమాట అనరు.
కావాల్సినంత ఉన్నా ఇంకా కావాలనుకునే వారు రాజకీయాల్లో కోకొల్లలు. కానీ మేకపాటి కుటుంబం ప్రత్యేకం. ఎవరిని ఆశించరు. ఎవరి దగ్గరా యాచించరు. చివరికి తమ నాశనం కోరుకున్న వారికి కూడా హాని తలపెట్టరు. తల్లిదండ్రులంటే అంతులేని అనురాగం ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన వద్దకు ఎవరూ వచ్చిన అదే గౌరవాన్ని ఇస్తారు. చిన్నపిల్లలు చెప్పినా శ్రద్ధగా వినేంత సంయమనం, సహనం లెక్కలేనంత. ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని ప్రయత్నించే చాలామంది నాయకులలా ఆయన ఉండరు. అవసరమైతే అలా కోరుకునే వాళ్లకి ముందు స్థానమిచ్చి ఆయన మొత్తం ఏమీ తెలియని వాడిలా వెనక నిలుచునే రకం. “మన పని మనం చేద్దాం.. మిగతావన్నీ మనకి అనవసరం ” అని పదే పదే తన టీంకి స్పష్టమైన దిశానిర్దేశం చేసే నవ యువ నాయకుడు. చిన్న పనిని కూడా పెద్ద ప్రచారం కోరుకునే ఈ కాలంలో పెద్దపెద్ద పనులు చక్కబెట్టినా క్రెడిట్ తీసుకోరు. కోరుకోరు. ముఖ్యమంత్రి పేరు ముందుగా ప్రస్తావించకుండా ప్రసంగం మొదలెట్టని విధేయత ఆయన సొంతం. ముఖ్యమంత్రి ఏ మంత్రిని అంతలా మెచ్చుకోని విధంగా పలు సందర్భాల్లో ప్రశంసించినప్పుడు తనలో తానే మురిసిపోయిన నిలువెత్తు సంస్కారం. జిల్లా బాధ్యతలన్నీ చూసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా ప్రజా సంబంధిత అంశాలు మినహా ఏ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోని వర్సెటైల్ పర్సనాలిటీ. కరోనా సమయంలో ఆయన స్పందించిన తీరు మీడియా మరవదు. తనను గెలిపించిన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రిగా ఆయన చూపించే చొరవ ప్రజలకు బాగా తెలుసు. తన మనసులో ఏముందో తాను బయటకు చెబితే తప్ప ఎవరు అర్థం చేసుకోలేని, అవసరమైనప్పుడు సమయానికి తగు అన్నట్లు నడుచుకునే కర్మయోగి!
ప్రభుత్వ సంకట పరిస్థితుల్లో ప్రజలకు, ప్రతిపక్షాలకు సబ్జెక్ట్ తో సమాధానం చెప్పడంలో ఘనాపాటి..మన మంత్రి మేకపాటి. మేకపాటి నోటి వెంట వచ్చే మాటకి విలువ ఎక్కువ. ఆయన అనవసరంగా మాట్లాడరు కాబట్టి మీడియాకు ఆయన మాటంటే ఎంతో నమ్మకం. అనుకూలంగా వార్తలు రాయించుకోరు. వ్యతిరేకంగా రాసే వారికి వద్దనీ చెప్పరు. తప్పు జరిగితే సరిదిద్దుకుందాం, పొరపాట్లు దొర్లితే పునరావృతం కాకుండా చూసుకుందాం అనేదే ఆయన భరోసా.
నిజంగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పాలసీని తీసుకుని 100% మంత్రి వర్గంలో మార్పులు చేయాలనుకుంటే అది ఆయన తుది నిర్ణయం. కాదనలేని శిరోధార్యం. కానీ, 99% మంత్రివర్గ మండలిని మార్చినా కచ్చితంగా ఆ 1%లో మంత్రి మేకపాటి ఉంటారు. ఉండాలి. ఖద్దర్ రాజకీయాలు, అర్థంలేని మాటలు,వ్యర్థమైన విమర్శలు లేని నూతన ఒరవడి సృష్టించే రాజకీయం నేటి అవసరం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి సారిగా ఒక విలక్షణ, వినూత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, వితరణశీలి, సహనశీలత, మేధస్సు ఉన్న నాయకుడు తెరపైకి వచ్చారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోన్నారు. ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల్లో సంస్కరణలతో దూసుకుపోతున్నారు. యువతను ఆకట్టుకునే శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రత్యేకంగా నిలిచారు.
అందుకే అలాంటి విలక్షణమైన మంత్రి కేబినెట్ లో ఒకరు ఉండాలి. అలాంటి విచక్షణ కలిగిన రాజకీయ నాయకులు ఇంకా కొనసాగాలి. అది జగన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎసెట్. ముఖ్యమంత్రి గారి ఆలోచనలను 100% ఆచరణలో పెట్టగల నిబద్ధత, వినయ్,విధేయత మంత్రి మేకపాటికి లెక్కపెట్టలేనంత. మిగతా వారిలా అది కావాలి , ఇది కావాలి అని అడగరు. ఏం చెబితే అది ముందుకు తీసుకెళ్లడంలో, కర్తవ్య నిర్వహణలో మంత్రి మేకపాటి ఎవరూ అందుకోలేనంతా. ఆయనెంతా అని అడిగిన వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశమంత.
—-
Comments are closed.