అమరావతి : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ అధినాయకత్వం తో ఢీకొని వైయస్ జగన్ వేరే కుంపటి పెట్టుకోనే సందర్భంలో ఆయన ముందు నడిచిన వ్యక్తుల్లో కీలకమైన నేత, మేకపాటి రాజమోహన్ రెడ్డి. తన ఎంపీ పదవిని సైతం వదులుకొని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో ప్రయాణించడం జరిగింది. గతం నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గరగా మెలిగిన వారిలో ముఖ్యులు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన తర్వాత, 2012 ఉప ఎన్నికల బరిలో జగన్ పక్షాన నిలిచి , అత్యంత మెజార్టీతో గెలుపొందారు. అలానే 2014 ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాల ప్రభాకర్ రెడ్డి పై గెలుపొందారు. ఇక 2019 నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనుకొనే సందర్భంలో చివర నిమిషాన పార్టీ నిర్ణయానికి కట్టుబడి నెల్లూరు పార్లమెంటు టికెట్టు ను వదులుకున్నారు. తర్వాతి కాలంలో వైయస్ జగన్ ప్రభుత్వం రావడం కుమారుడు మేకపాటి గౌతం రెడ్డి కి మంత్రి పదవి దక్కడం తెలిసింది. అయితే జిల్లాలోని వైఎస్ఆర్ సీపీ శ్రేణుల లో పెద్దాయన గా పిలవబడే మేకపాటి రాజమోహన్ రెడ్డి కి కీలక పదవి రావాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి మేకపాటి రాజమోహన్ రెడ్డికి వరించబోతున్నదని సోషల్ మీడియా తో పాటు మెయిన్ స్ట్రీం మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ప్రస్తుత టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మా పదవీ కాలం రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి , అధిష్టానం వేరే ఒక్కరికి దేవుని సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే ఆనందంగా తప్పుకుంటానని అన్నారు. ఆయన అలా మాట్లాడడంతో ఇంకా ఈ వార్తలకు బలం చేకూరింది. అలానే వైయస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వారు ఎవరు అయినా … కష్టకాలంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయం చేస్తాడని, అలాంటిది మొదటినుంచి వున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కి కీలక పదవి ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని జగన్ గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా ఏ పదవి ఇచ్చిన దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చే గల అనుభవం, వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన అభిమానులతో పాటు వారికి మంచి పదవి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము.
Comments are closed.