*ఫలించిన మేకపాటి స్వప్నం*
*: సంగంలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి అనుమతులు మంజూరు*
*: ఏడీఎఫ్ సహకారంతో జీఆర్ఎన్ కన్ర్ట్సక్షన్స్ ద్వారా నిర్మాణం*
*: నియోజకవర్గంలో 3వ ఐటీఐ కళాశాల*
ఉన్నత విద్యావంతుడు శాసనసభ్యుడిగా మారితే ఆ నియోజకవర్గంలో యువత కలలు సాకరమవుతాయనే దానికి నిదర్శనం సంగంలో త్వరలో జరగనున్న ఐటీఐ కళాశాల నిర్మాణం. ఆత్మకూరు నియోజకవర్గంలో యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణతో అత్యధిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే తలిచిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్వప్నం సాకరమైంది.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు, ఏఎస్ పేటలలో ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. దీంతో పాటు సంగంలో నూతనంగా ఐటీఐ కళాశాల నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడంతో యువత నైపుణ్యాభివృద్ది వైపు దృష్టి సారించి అత్యధికంగా ఉద్యోగాలు సాధించే మార్గం సుగమమం అయింది.
వివరాల్లోకెళితే ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నియోజకవర్గంలో యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో గతంలో సంగంలో ఉన్న ఐటీఐ కళాశాలకు భవన వసతి లేకపోవడంతో ఆత్మకూరులో నిర్వహిస్తున్నారనే విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా తెలుసుకున్నారు.
ఐటీఐ కళాశాల నిర్మాణం జరిగితే సంగం, దాని పరిసర మండలాల విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆలోచన చేశారు. గతంలో తమ సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హయాంలో ఉన్న ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాక నియోజకవర్గ అభివృద్ది కోసం తాను ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా సంగం ఐటీఐ కళాశాల నిర్మాణానికి జీఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణం చేపట్టేలా వారిని ప్రోత్సహించారు.
ఈ నేఫధ్యంలో కంపెనీ ప్రతినిధులు సంగం ఐటీఐ కళాశాల నిర్మాణ బాధ్యతలు తాము తీసుకుంటామని అయితే కళాశాలకు గంటా రమణయ్యనాయుడు ఐటీఐ కళాశాలగా పేరు ఏర్పాటు చేసేలా చూడాలని ఎమ్మెల్యే మేకపాటికి తెలిపారు. దీంతో సంగంలో ఐటీఐ కళాశాల నిర్మాణం కోసం జీఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ సీయస్ఆర్ నిధుల ద్వారా నిర్మాణాలు చేపడుతుందని, కళాశాలకు వారు కోరిన విధంగా గంటా రమణయ్యనాయుడు పేరును పెట్టేలా చూడాలని పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు.
ఎమ్మెల్యే మేకపాటి కృషి ఫలితంగా శుక్రవారం కళాశాల నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడంతో పాటు గంటా రమణయ్యనాయుడు పేరున కళాశాల ఏర్పాటు కోసం అనుమతులు మంజూరు కావడంతో కళాశాల నిర్మాణానికి మార్గం సుగమం అయింది.
ఆత్మకూరు నియోజకవర్గంలో యువత ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రానున్న భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని వారి కోసం నైపుణ్యాభివృద్ది శిక్షణ అందచేసేందుకు నియోజకవర్గంలో 3వ ఐటీఐ కళాళాల నిర్మాణం జరగనుండడంతో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Comments are closed.