మహారాష్ట్ర ఎన్నికల ఫీవర్ మొదలైంది,ఏ క్షణమైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది,ఇప్పటికే ఈ మేరకు తుది కసరత్తు జరుగుతుంది, హర్యానా జమ్మూకాశ్మీర్ ఫలితాలతో మహారాష్ట్ర ఎన్నికలలో బిజెపిలో జోష్ పెరిగింది. హర్యానాలో అధికారం అందినట్లే అంది చేజారడంతో రాహుల్ గాంధీ అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేశారు. కూటమితో కలిసి ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహా వికాస్ అగాడి మిత్రబక్షాలు ఈసారి తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం ఎవరు అనేది తరువాత నిర్ణయించిన తమ బలానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరగాలని ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో రాహుల్ గాంధీ ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాల సమన్వయం, సీట్ల సర్దుబాటు, ప్రచారం పైన ప్రధానంగా సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక ప్రధానంగా పార్టీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలు, సమన్వయం లేకపోవటమే ప్రధానమని గుర్తించిన రాహుల్ మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎన్నికల సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బిజెపి కూటమిని ఫిక్స్ చేయటానికి ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. దీనిపైన ఉద్దవుథాక్రేస్పందించారు. అధికారంలో ఉన్న కూటమి తమ సీఎం ఎవరో చెబితే తమ నుంచి ఎవరో సీఎం అభ్యర్థి తాము ప్రకటిస్తామని కౌంటర్ ఇచ్చారు. అధికార కూటమిని లక్ష్యంగా చేసుకొని అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందిందని ఆరోపించారు.ఇక ఇప్పుడు రాహుల్ సమావేశం తర్వాత కాంగ్రెస్ సైతం తమ కార్యాచరణ వేగవంతం చేసే అవకాశం ఉంది.
Comments are closed.