*ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం : నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి*
*: మేకపాటి కుటుంబంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవుతాం*
*: సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించండి : ఎమ్మెల్యే మేకపాటి*
*పడమటిపాళెం, పల్లిపాళెంలో ఎన్నికల ప్రచారం*
జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా తనను, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలు కోరిన అభివృద్ధిని చేసి చూపిస్తామని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు.
ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కలసి గురువారం రాత్రి సంగం మండలం పడమటిపాళెం, పల్లిపాళెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తమకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సాదర స్వాగతం పలికారని, వారందరికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
నెల్లూరు పార్లమెంట్ లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆత్మకూరు అని, దానిని అభివృద్ధి చేసేందుకు మేకపాటి కుటుంబంతో కలసి భాగస్వామిగా మారి అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. గ్రామంలో 150 ఎకరాల సీజెఎఫ్ఎస్ భూముల సమస్యల పరిష్కారంతో పాటు ఎంపీ ల్యాడ్స్ ద్వారా కమ్యూనిటి హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, పోలేరమ్మ గుడికి అవసరమైన నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు.
వడమటిపాళెం సర్పంచ్ ఎన్నికైన కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి నాలుగు సంవత్సరాల పాటు పార్టీలో ఉండే అవసరమైన పనులన్ని చేయించుకుని ఇప్పుడు పార్టీ మారారని, అయితే ఆయన ఏకగ్రీవంగా గెలిచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలోనేనన్నారు.
గ్రామాభివృద్ధి కోసం ప్రస్తుతం మా వెంట నడుస్తున్న వారికి అండగా నిలిచి ఈ గ్రామంలో అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు. జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్డ్డికి, ఎంపీగా తనకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మన పార్టీలో ఉండి ఐదు సంవత్సరాలు అన్ని పనులు చేసుకుని ఎన్నికల సమయంలో వారి స్వరాభం కోసం పార్టీ మారారని, ప్రజలు తెలిపిన సమస్యలను పక్కన పెట్టారన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారధ్యంలో వనిదేస్తామని అన్నారు.
ప్రస్తుతం మా వెంట నడుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. భయపడే రాజకీయాలు, భూ రాజకీయాలకు ముగింపు పలికి అందరికి క్షేమం చేకూరేలా చేస్తామని అన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి మెనిఫెస్టోను సిద్దం చేసి అందించామని, రాబోయే ఐదు సంవత్సరాలలో వాటిని ఏ విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
గ్రామస్తులు తెలిపిన అన్ని నమస్యలను స్థానిక నాయకుల సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారం అవసరమని, మే 13న జరిగే ఎన్నికల్లో వైఎసార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మీరు కోరుకున్న సంక్షేమ పాలన మళ్లీ కొనసాగుతుందని ఆ విధంగా ఆశీర్వదించాలని కోరారు.
Comments are closed.