*అభిమానసంద్రం వెంట రాగా…*
*: అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్ రెడ్డి*
*: వైఎస్సార్సీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ది*
ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అపూర్వ కరాయక్రమానికి ఆయన వెంట పలువురు నియోజకవర్గ నాయకులు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ప్రజల ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశారు.
తొలుత బ్రహ్మణపల్లిలో తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుకున్న అనంతరం బ్రాహ్మణపల్లిలోని రామాలయం, గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంటవీధిలోని అంకమ్మ మాను వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారీ జనసందోహం నడుము జై జగన్, జై మేకపాటి నినాదాలతో ఆశీర్వదిస్తూ సాగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తి, చేజర్లజడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారధిలతో కలసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కురబ మధులతకు నామినేషన్ పత్రాలను అందచేశారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీ నాయకులను ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు వారితో తీసుకెళ్లి ప్రజలను మభ్య పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఈ రోజు జరిగిన నామినేషన్ కు వచ్చిన ప్రజాస్పందనతో వారి ప్రయత్నాలన్ని బెడిసికొట్టినట్లుగా అయిందన్నారు.
ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదం వైఎస్సార్సీపీకే ఉందన్న విషయం మరోమారు స్పష్టమైందని, ప్రజలంది ఆశీర్వదాంతో మళ్లీ ఆత్మకూరు శాసనసభ్యునిగా గెలుపొంది ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేస్తానని మాట ఇచ్చిన ప్రత్యేక గ్రామ మెనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వివరించారు.
ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అభివృద్దిని చూపిస్తామని, ఇందుకోసం ముందు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని ఉన్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో అభివృద్దిని చూపిస్తామని పేర్కొన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపక్ష నాయకుడు కనీసం మన ప్రాంత ప్రజలకు అవసరమైన నీటిని కూడా గట్టిగా అడిగి తెచ్చుకోలేకపోయారన్నారు.
ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా జరగాల్సిన ప్రతి అభివృద్దిని తప్పకుండా పూర్తి చేస్తామని, ప్రజల అవరాలను గుర్తించి వారికి అవసరమైన పనులన్నింటిని పూర్తి చేస్తామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వాన్నే మళ్లీ గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
Comments are closed.