*సంక్షేమాభివృద్ది పాలనకు చిరునామా జగనన్న ప్రభుత్వం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: నియోజకవర్గాభివృద్దికి రూ.1800 కోట్లు*
*: మైపాటివారికండ్రిక, వావిలేరులో విజయీభవయాత్ర*
*: అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి*
రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సంక్షేమం, అభివృద్ది దిశగా జగనన్న నడిపిస్తున్నారని, సంక్షేమాభివృద్ది పాలనకు జగనన్న ప్రభుత్వం చిరునామాలా మారిందని, రానున్న ఎన్నికల్లో మళ్లీ ప్రజలు జగన్నన సంక్షేమ పాలన కొనసాగించేలా ఆశీర్వదిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
మంగళవారం చేజర్ల మండలం మైపాటివారికండ్రిక, వావిలేరు గ్రామాల్లో విజయీభవయాత్రను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
జగనన్న ఐదేళ్ల పాటు సంక్షేమం, అభివృద్దిని మీ అందరికి అందించారని, ప్రస్తుతం ఆయనకు మీరంతా అండగా ఉండి ఆశీర్వదిస్తే మళ్లీ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన కొనసాగిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని, ఆత్మకూరు నియోజకవర్గాభివృద్ది కోసం రూ.1800 కోట్లు అందచేసిన విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నామని అన్నారు.
తనకు ప్రత్యర్థి మాజీ మంత్రి ఆనం రామానారయణరెడ్డి వస్తున్నారని గత 15 రోజుల నుంచి మీడియా ద్వారా తెలుస్తుందని, అయితే గతంలో ఆయన వెంకటగిరి నుంచి పోటిచేస్తానని, నెల్లూరు అంటే ఇష్టమని చెప్పిన సందర్భాలు ఉన్నాయని, వారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించేంత వరకు దీనిపై తాను ఎలాంటి మాటలు చెప్పలేనని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ శాసనసభా స్థానం నుంచి పోటి చేసే ప్రత్యర్థి జగనన్న సంక్షేమాన్ని, అభివృద్దిని దాటుకుని ప్రజల్లోకి రావాల్సిందేనని, అలాంటి అభివృద్దిని, సంక్షేమాన్ని ప్రజలకు జగనన్న అందచేశారని, ఆయన సారధ్యంలో రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
విజయీభవయాత్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్దిని వివరిస్తూనే రాబోయే రోజుల్లో చేసే అభివృద్దిని ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక మెనిఫెస్టో సిద్దం చేసి ప్రజలకు తెలుపుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా మైపాటి వారికండ్రిక గ్రామంలో రూ.35లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లు, వావిలేరు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
Comments are closed.