The South9
The news is by your side.
after image

పేదరిక నిర్మూలనే జగనన్న లక్ష్యం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

 

*పేదరిక నిర్మూలనే జగనన్న లక్ష్యం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: పదిసార్లు చెబితే అబద్దం నిజం కాదు*

*: గ్రామ స్వపరిపాలనతో మరింత మెరుగ్గా జీవనశైలి*

*: అభివృద్ది, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి*

 

👉రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేశారని, ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రోత్సహాం అందిస్తూ వారు మరింత ప్రగతి సాధించేలా చర్యలు తీసుకున్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.

 

Post Inner vinod found

👉శుక్రవారం ఆత్మకూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద ఆత్మకూరురూరల్, మున్సిపల్ పరిధిలో వైఎస్సార్ పించను కానుక పెంపు ఉత్సవంలో ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు పించను లబ్దిదారులకు అధికారులు, నాయకులు,ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే మేకపాటి పించను కానుకను అందచేశారు.

 

Post midle

👉అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రతి సామాజిక వర్గానికి ఆర్థికంగా అభివృద్ది చేశారని, సంక్షేమ పథకాల ద్వారా వారిని ప్రోత్సహించారని వివరించారు. 60 సంవత్సరాలు దాటిన వృద్దుల కోసం పించను నగదును ప్రతి సంవత్సరం రూ.250 పెంచుతూ ఈ సంవత్సరం రూ.3వేలు అందచేస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

 

👉అవ్వాతాతలు ఇబ్బందులు పడకుండా ప్రతి నెల1వ తేది ఇంటికి వచ్చి పించను అందచేసే వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని, దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పించన్లు వారి అందుతున్నాయని, నాలుగున్నర సంవత్సరాల పాటు ఇది గమనించిన ప్రతిపక్ష పార్టీలు వారిపై అనవసర ఆరోపణలు చేశారని, ప్రజలంతా వాలంటీర్ వ్యవస్థకే మద్దతుగా నిలిచారన్నారు.

 

👉టీడీపీ, జనసేన పార్టీలు పదే పదే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తూ పదిసార్లు చెబితే అబద్దం నిజమవుతుందని భావించారని, నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇలా ఆరోపణల చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ పింఛను కానుక తమ రాజకీయ అవసరాలకు వినియోగించాలని ఛూస్తున్నారని, అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇస్తే అవ్వాతాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

 

 

👉జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వపరిపాలన సాధ్యమైందని, ఆ వ్యవస్థ ద్వారా జిల్లా, మంఢల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 

👉జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోని వారికి వివరించాలని, మళ్లీ ముఖ్యమంత్రిగ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలిపించుకునేలా అందరం సమిష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.

Post midle

Comments are closed.