*మాటకు కట్టుబడ్డ సీయంకు అండగా నిలుద్దాం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలను ఆయనకు ప్రతిఫలంగా ఇద్దాం*
*: సంగంలో పించన్ల పెంపు ఉత్సవంలో ఎమ్మెల్యే*
👉దేశ చరిత్రలోనే తాను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పి నూటికి నూరు శాతం మాటకు కట్టుబడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాంటి వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
👉గురువారం మధ్యాహ్నం మండల కేంద్రమైన సంగం తుంగా దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్సార్ పించను కానుక పెంపు ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని మండలంలో నూతనంగా మంజూరైన పించన్లను పలువురు లబ్దిదారులకు అందచేశారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అందించని విధంగా పించను నగదు రూ.3వేలు అందచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, తాను చెప్పిన ప్రతి మాట, ప్రజలకు చేస్తానని ప్రతి సంక్షేమాన్ని చేతల్లో చేసి చూపించారని అన్నారు.
👉ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు వారికి నేరుగా అందచేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేశారని, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి 1వ తేది ఉదయమే పించను అందచేస్తున్నారని అన్నారు.
👉అర్హతే ప్రమాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక పించన్లు అందచేస్తున్నారని, పించను నగదు పెంచడమే కాకుండా పెన్షనర్ల సంఖ్య కూడా ఇప్పుడు భారీగా పెరిగిందని, ఈ నెలలో ఒక్క సంగం మండలంలోనే 85 నూతన పించన్లు మంజూరు కావడం జరిగిందని వివరించారు. సంగం మండల వ్యాప్తంగా 6775 మందికి సామాజిక పించన్లు అందచేయడం జరిగిందని, దీని ద్వారా ప్రతి నెల పించన్లకు రూ.2.07 కోట్లు అందచేస్తున్నారని అన్నారు.
👉గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయలేని కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు బురద చల్లుతూ తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి తమ కమిటిలతో పించను పథకాన్ని రాజకీయంగా వాడుకుని అవ్వతాతలను ఇబ్బందులకు గురిచేస్తారని అన్నారు.
👉అలాంటి వారు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నే కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్నింటా నెం.1గా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న జగనన్నకు ఆయన కోరుకున్న 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయమే మనమంతా కలిసి ఇచ్చే ప్రతిఫలమని, సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించేలా అందరం కృషి చేద్దామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.
Comments are closed.