The South9
The news is by your side.
after image

రాబోయే రోజుల్లో కుటుంబాన్ని చీల్చే రాజకీయ కుట్రలు చేస్తారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. సీఎం జగన్.

*తేది: 03-01-2024*

*స్థలం: కాకినాడ*

 

*ఇచ్చిన హామీ నెరవేరుస్తూ.. వృద్ధాప్య పెన్షన్ ను దేశంలోనే అత్యధికంగా రూ. 3 వేలకు పెంచి ఇస్తున్నాం.. సీఎం జగన్*

 

*ప్రతి నెలా రూ. 2 వేల కోట్ల ఖర్చుతో 66.34 లక్షల మందికి గడప వద్దకే పెన్షన్లు*

 

*గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి.. నేడు లంచాలు, వివక్ష లేకుండా పెన్షన్*

 

*చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు భాగస్వామి కాబట్టే అయన్ను ప్రశ్నించరు*

 

*’రాబోయే రోజుల్లో ఇంకా కుట్రలు, పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. వీటిపై మీరందరూ అప్రమత్తంగా ఉండాలి’.. కాకినాడ బహిరంగ సభలో సీఎం జగన్*

 

 

Post midle

“ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్షన్ రూ.3 వేలకు పెంచాం. నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదు పేదలు, వృద్దుల జీవితాలు మారాలి. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండరాద‌ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్‌ అందిస్తున్నాం. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నాం. నా సైన్యం వాలంటీర్లు. వారి ద్వారానే సమయానికి పెన్షన్‌ పంపిణీ చేయగలుగుతున్నాం. అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను” అని సీఎం జగన్ రూ. 3 వేల పెన్షన్ పెంపుపై కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్నారు. కాకినాడ‌లో ఏర్పాటు చేసిన పింఛ‌న్ల పెంపు సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు.

 

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక మార్పు మాత్రమే కాదని.. జీవితాల్లో మార్పు రావాలని సీఎం జగన్ అన్నారు. వారి ఆనందం కూడా మెరుగైన పరిస్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పెద్ద వయసు ఉన్నవారు, విధి రాత వల్ల తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో అక్షరాల 64 లక్షల 34 వేల మంది ఉన్నారని నేడు ఆ అభ్యాగులకు, వితంతువులకు మంచి చేస్తూ సామాజిక పెంఛన్‌ను అక్షరాల రూ.3 వేలకు పెంచామని సీఎం తెలిపారు.

 

*ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి పెన్షన్*

 

నేడు మీ బిడ్డ ప్రభుత్వంలో 64.34 లక్షల మందికి పింఛన్ల కోసం చేస్తున్న ఖర్చు నెల నెల అక్షరాలు దాదాపుగా రూ.2 వేల కోట్లు అని సీఎం జగన్ అన్నారు. ప్రతి నెలా 1వ తారీఖున పండుగైనా, సెలవు, ఆదివారం అయినా సరే మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్లు మాత్రం అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసే రోజని అన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిందని, కులం, మతం, ప్రాంతం,వర్గం చూడటం లేదని, చివరికి ఏ పార్టీ అని చెప్పి ఎవరూ అడగడం లేదని, అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.

 

ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితిలో ఒక్కసారి గతానికి అంటే ఐదేళ్ల క్రితం పరిస్థితి గమనించాలని, అప్పట్లో చంద్రబాబు పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా పింఛన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చాడని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఆనాడు కూడా ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్‌ రూ.2 వేలు చేశాడని,ఎన్నికలు రాకపోయి ఉంటే..మీ బిడ్డ జగన్‌ రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఆ పింఛన్‌ పెంచేవాడా?అని సీఎం ప్రశ్నించారు.

 

Post Inner vinod found

*గత ఇదేళ్లలో టీడీపీ రూ. 58 వేలు ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ. 1.47 లక్షలు ఇచ్చాం.. సీఎం జగన్*

 

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో యావరేజ్‌ కింద పింఛన్‌ కేవలం రూ.58 వేలు ఇస్తే మీ బిడ్డ పాలనలో అవ్వాతాతల చేతుల్లో ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అక్షరాల రూ.1.47 లక్షలు ఇచ్చామని తెలిపారు. వికలాంగులను లెక్కల్లో వేసుకుంటే వారికి రూ.1.82 లక్షలు ఇచ్చామని, గతానికి ఇప్పటికి మధ్య తేడా గమనించాలని సీఎం కోరారు.

 

*గతంలో పెన్షన్ కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి*

 

గతంలో పెంఛన్‌ కావాలంటే పడిగాపులు పడాలని, పింఛన్‌ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదాని, పింఛన్‌ తీసుకోవాలంటే లైన్లలో నిలబడాలని గురక్తు చేశారు. ఒకవైపు లంచాలు, మరోవైపు వివక్ష, మరో వైపు చెంతాడంత క్యూలైన్లు, ఈ రోజు ఎవరికి పింఛన్‌ కావాలన్నా అర్హత ఉంటే చాలు మంజూరు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

 

*చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు కూడా భాగస్వామే.. అందుకే ప్రశ్నించరు*

 

చంద్రబాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామి. చంద్రబాబు అవినీతిపై పచ్చ మీడియా ఏమీ రాయవు, చూపించవన్నారు. ఐదేళ్లు గతంలో సీఎంగా ఉన్న ఒకాయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడని, ఆ ఇద్దరు కలిసి 2014లో ఎన్నికల ప్రణాళికలో వాళ్లు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, అందులో ఇళ్లు కట్టిస్తామని వాగ్ధానం చేశారని, చివరకు ఒక్క సెంట్‌ కూడా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. అడ్డగోలుగా దత్తతండ్రి మోసం చేస్తే..ఈ దత్తపుత్రుడు కనీసం ప్రశ్నించలేదని కానీసం కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదని సీఎం దుయ్యబట్టారుకానీ, నేడు. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు వారి కుటుంబాలకు మంచి చేయాలని మీ బిడ్డ పరుగెత్తుంటే. . అక్షరాల 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూస్తుంటే.. ఇదే దత్తపుత్రుడు ఇవాళ కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని ఎద్దేవా చేశారు. పేదలకు కట్టే ఇళ్లలో అవినీతి జరిగిందని కేంద్రానికి లేఖలు రాసి ఇంటి నిర్మాణాలు ఆపాలని చూసిన దిక్కుమాలిన వ్యక్తి ఈ అన్యాయస్థులేనని మండిపడ్డారు.

 

చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపిందని, జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడని. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడని, చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడని విమ‌ర్శించారు.

 

*రాబోయే రోజుల్లో కుటుంబాన్ని చీల్చే రాజకీయ కుట్రలు చేస్తారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. సీఎం జగన్*

రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని, మీరందరూ అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. “చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమే లేదు.ఈ ఒక్క స్కీమ్‌ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ ..అక్షరాల మీ బిడ్డ బటన్‌ నొక్కడం నేరుగా రూ.26 వేల కోట్లు మీ ఖాతాల్లోకి జమ చేశాను. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారారు. నా అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు ఇచ్చాను. చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు.ఆ ఐదేళ్లు రైతు భరోసా స్కీమే లేదు. ఇవాళ ప్రతి ఏడాది అక్షరాల రూ.53.57 లక్షల మంది రైతులకు మీ బిడ్డ బటన్‌ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.13,500 జమ చేస్తున్నాం. ఈ స్కీమ్‌ ద్వారా ఈ ఐదేళ్లలో రూ.33,300 కోట్లు మీ బిడ్డ ఇచ్చాడు. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. ముఖ్యమంత్రి మాత్రమే మారారు.

 

అదేరాష్ట్రం, అదే బడ్జెట్‌. ఆలోచన చేయండి. చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్‌ఆర్‌ ఆసరా అనే స్కీమే లేదు. ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఈ 55 నెలల్లో నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి రూ.19,178కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను. చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్‌ఆర్‌ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న నా అక్కచెల్లెమ్మల బాగోగులు పట్టించుకున్న నాథుడే లేడు. వాళ్లు బాగుంటే వాళ్ల కుటుంబాలు బాగుంటాయని నమ్మిన మీ బిడ్డ నాఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ తోడుగా ఉంటూ ప్రతి ఏటా రూ. 18,500 డబ్బులు ఇస్తున్నాను. 26.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ ..నేరుగా బటన్‌ నొక్కి రూ.14,169 కోట్లు జమ చేశాను. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా రూ.982 కోట్లు నా నిరుపేద నేతన్నలకు అండగా నిలబడ్డాను. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా నా డ్రైవర్‌ అన్నదమ్ములకు రూ.1302 కోట్లు నేరుగా జమ చేశాను.

 

ఈబీసీ నేస్తం ద్వారా రూ.1252 కోట్లు నా నిరుపేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను. ఆగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా రూ.2,955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ.1250 కోట్లు ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చెంతాడంత ఉంటుంది. ఆలోచన చేయండి. ఎక్కడైనా కూడా లంచాలు, వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీలో లిస్టు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తోడుగా నిలబడుతున్నాడు. నేరుగా డబ్బులు పంపిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ పాలనలోనే జరుగుతుంది. ప్రతి విషయం కూడా ఆలోచన చేయాలి” అని సీఎం సూచించారు.

Post midle

Comments are closed.