*మీరే నా బలం, బలగం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: సమిష్టి కృషితో జగనన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాం*
*: నియోజకవర్గ నాయకులు, పరిశీలకులతో ఆత్మీయ సమావేశం*
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో రానున్న ఎన్నికల్లో పోటిలో నిలచేందుకు సైతం భయపడుతున్నారంటే మా వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే వల్ల సాధ్యమైందని, మీరే నా బలం, బలగం అని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
మంగళవారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని నివాసంలో నాయకులు, పంచాయతీ పరిశీలకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలపై వారికి పలు సూచనలు, సలహాలు అందచేస్తూ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మా సోదరుడు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటి చేసినప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా నిలిచారని, ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు సైతం అభ్యర్థులు భయపడుతున్నారంటే కార్యకర్తలు, నాయకులు, అభిమానుల వల్లే సాధ్యమైందని అన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో తాను శాసనసభ్యునిగా ఒకటిన్నర సంవత్సరాలు అయిందని, మీ అందరూ పూర్తిస్థాయలో సహకారం అందించారని, నియోజకవర్గంలో తెలిపిన అభివృద్ది, సంక్షేమపనుల కార్యాచరణ కోసం ప్రతి మూడు నెలలకోసారి పర్యవేక్షణ చేయడం జరిగిందని, గ్రామాల్లో అభివృద్ది పనుల నిర్వహణ కోసం ఒక పంచాయతీకి చెందిన నాయకుడిని మరో పంచాయతీకి పరిశీలకులుగా నియమించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది, సంక్షేమం మరింత అభివృద్ది చేసుకునేందుకు, పార్టీ నాయకులు సమిష్టిగా మారేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ తాను రెండు హామిలు ఇచ్చానని, అందులో ఒకటి 10 సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని నెం.1 స్థానంలో నిలబెట్టడం అని, అది అందరి సమిష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని వివరించారు. పంచాయతీ, వార్డుస్థాయి నుంచి ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేసి బాధ్యతాయుతంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.
ప్రతి పంచాయతీ, సచివాలయం పరిధిలో కోరుకునే అభివృద్ది, సంక్షేమ పనులు ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరం వాటన్నింటిని నమోదు చేస్తే గ్రామ మెనిఫెస్టోగా మారుతుందని, దీని ద్వారా ప్రతి గ్రామానికి ఏం అవసరమవుతాయో తెలుసుకుని చేసుకుంటూ పోవచ్చునని అన్నారు. ఇందుకోసం ప్రతి పంచాయతీ ఇద్దరు, ముగ్గురు నాయకులను నియమించడం జరిగిందని, వారు గ్రామానికిఅవసరమైన అన్ని పనులు నిర్వహించేందుకు తన దృష్టి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేసే విధంగా చూస్తారని అన్నారు.కార్యాచరణ, ప్రణాళిక ద్వారా అభివృద్ది సాధించవచ్చునని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యవస్థల్లో భాగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని, దీని ద్వారా ఇప్పటి వరకు 32 వేల నోషనల్ ఖాతాలు పరిష్కరించగలిగామని, చుక్కల భూములు, సాదాబైనామా సమస్యలు పరిష్కరించడం జరిగిందని వివరించారు. పంచాయతీలు, వార్డులకు ఇన్ చార్జిలుగా నియమించిన వారు ఇంకా ఇలాంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తే సమస్య పరిష్కారమవుతాయని వివరించారు.
పంచాయతీలకు అవసరమైన అభివృద్ది, సంక్షేమ పనులపై ఇన్ చార్జిలుగా నియమించిన వారితో పాటు నాయకులు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందని, దీని ద్వారా పనులు వేగంగా జరుగుతుతాయని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారని, రూ.2.50 లక్షల కోట్లు ప్రజలకు అందచేశారని, అమ్మఒడి, నేడునేడు ద్వారా ప్రభుత్వ విద్యను అందరికి చేరువ చేశారని వివరించారు. ఇలాంటి పథకాలు పెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించడం జరిగిందని, అయితే ఇప్పుడే వారు ఈ పథకాలకు మరింత నగదు అందచేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారని అన్నారు
ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారని, ప్రభుత్వం ద్వారా ప్రతి పేద కుటుంబం అభ్యున్నతి సాధించేలా కష్టపడుతుంటారని, ఆయనకు నేను ఆత్మకూరు నియోజకవర్గాన్ని టాప్-10లో నిలబెడుతానని మాట ఇచ్చానని, మీ అందరి భాగస్వామ్యంతో అది నెరవేర్చాలన్నారు.
రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నధంగా ఉండాలని, నియోజకవర్గంలో ప్రతి కష్టర్ కు ఒకరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, ప్రచార సామాగ్రి పంపిణీ దగ్గర నుండి దగ్గర నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి కష్టర్ లో ఉండే ఓటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఓటు ముఖ్యమైనదని, ఓటర్ల జాబితాలో నూతనంగా చేర్చిన ఓట్లు చేర్పులు జరిగాయా లేదా చూడాలని అన్నారు. వచ్చే మూడు నెలల పాటు ప్రతి క్లష్టర్ పరిధిలో ఎన్నికల ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించే విధంగా చూడాలని అన్నారు. సమిష్టి కృషితో పూర్తి సన్నధంతో ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
Comments are closed.