The South9
The news is by your side.
after image

రైతుల అభ్యున్నతి కోసం ‘వ్యవసాయ సమీక్ష’ : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

*రైతుల అభ్యున్నతి కోసం ‘వ్యవసాయ సమీక్ష’ : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి*

*: గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అభివృద్ది పనులు*

*: పొంగూరుకండ్రికలో గడప గడపకు మన ప్రభుత్వం*

 

మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో ఇలాంటివి జరిగిన రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందచేసేందుకు వ్యవసాయరంగంలో నిష్ణాతులైన వారితో డిసెంబర్ 9న వ్యవసాయ సమీక్ష నిర్వహిస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

 

బుధవారం మర్రిపాడు మండలం భీమవరం సచివాలయం పరిధిలోని పొంగూరుకండ్రిక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని వెంకయ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

 

Post Inner vinod found

అనం తరం గ్రామంలో ప్రతి గడపకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ది కరపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

Post midle

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ది పథకాలను అందచేశారన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అర్హులైన అందరికి సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. చిన్న చిన్న కారణాలతో అనర్హులుగా ఉన్న వారిని సైతం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులను చేసి వారికి సంక్షేమ పథకాలను అందచేశారన్నారు.

 

ప్రధానంగా రైతు భరోసా అందచేయడంతో భూముల విషయమై రైతులంతా తమ రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందకు వచ్చారని, దీంతో జిల్లా కలెక్టర్ ను కలసి రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని అన్నారు. ఇప్పటికే 30 వేల నోషనల్ ఖాతాలు, 8 వేల సాదాబైనామా కేసులు, 23 ఎకరాల చుక్కల భూములు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

 

ప్రతి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.20లక్షలు నిధులు మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.20లక్షలు నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. అంతేకాక అభివృద్ది పనుల్లో భాగంగా గ్రామంలో అవసరమైన సీసీరోడ్లు, సైడ్ డ్రైయిన్లు లాంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని వివరించారు.

 

డిసెంబర్ 9వ తేది నిర్వహించే వ్యవసాయ సమీక్షలో వ్యవసాయరంగంలో నిష్ణాతులైన వారిని పిలిపించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందచేసే విధంగా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. ఇలాంటి వ్యవసాయ సమీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

 

ప్రతి సంవత్సరం వ్యవసాయ సమీక్షల ద్వారా వారు అందచేసిన సలహాలు, అభివృద్ది గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 90 శాతం రైతులు ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు యువత కోసం వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ సమీక్షకు రైతులకు ఆహ్వనం పంపనున్నట్లు వివరించారు.

Post midle

Comments are closed.