*మెట్ట ప్రాంత రైతులకు అందుబాటులో బ్యాంకు సేవలు : ఎమ్మెల్యే మేకపాటి*
*: ఏఎస్ పేటలో ఎన్ డీసీసీ బ్యాంకు ప్రారంభం*
మెట్ట ప్రాంత రైతులకు నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి ఆర్థికాభివృద్దికి వ్యవసాయాభివృద్ది తోడ్పాటునందించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఏఎస్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటి బ్యాంకును ఆయన ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉన్నతాధికారులతో కలసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి బ్యాంకు భవనాన్ని పూర్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటికి బ్యాంకు అధికారులు తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను గురించి ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏఎస్ పేటలో ఏర్పాటు చేయడం శుభపరిణామనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఇలాంటి బ్యాంకుల ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నారని అన్నారు. రైతులకు త్వరితగతిన రుణాలు అందించేలా బ్యాంకు అధికారులు కృషి చేస్తన్నారని అన్నారు.
ఇలాంటి బ్యాంకులను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకును సీఈఓను కోరుతున్నామని, పర్యాటక ప్రాంతమైన ఏఎస్ పేట దర్గా పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వచ్చే ప్రభుత్వంలో హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, తప్పకుండా ఏఎస్ పేట రైతులకు నీటిని అందిస్తామని అన్నారు.
పొదుపు గ్రూపులకు ఈ బ్యాకు ద్వారా 7, 8, 9 శాతానికే రుణాలు అందచేస్తామని బ్యాంకు అధికారులు తెలిపడంతో గృహ నిర్మాణదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీయం ద్వారా 24 గంటలు నగదు తీసుకునే అవకాశం ఉండడంతో యాత్రా స్థలమైన ఏఎస్ పేటకు వచ్చే యాత్రికులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు.
ఈ సందర్భంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన, బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వారికి ఎమ్మెల్యే మేకపాటి ధృవీకరణ పత్రాలు అందచేశారు.
Comments are closed.