*ప్రతి ఒక్కరి ఆరోగ్యమే ముఖ్యమంత్రి లక్ష్యం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 2 కోట్ల కుటుంబాలకు వైద్యసేవలు*
*: సరైన సమయంలో వైద్య పరీక్షలు ముఖ్యం*
*ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*శనివారం ఏఎస్ పేట మండలం కావలియడవల్లి సచివాలయం పరిధిలో జరిగిన జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత క్యాంపులో వైద్యసేవలు పొందుతున్న ప్రజలతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మీయంగా మాట్లాడారు.*
*అనంతరం ఐసీడీయస్ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు అందచేస్తున్న పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పౌష్టికాహార తయారీ గురించి ప్రజలకు వివరించి వాళ్లే స్వయంగా చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించాలని వారికి సూచించారు.*
*అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన సమయంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని, ఆపత్కర సమయాల్లో అప్పటికప్పుడు చేయించుకుంటే కుటుంబ పెద్దను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.*
*తన సోదరుడు, దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విషయంలో కూడా ముందుగా ఇదే జరిగిందని, ఇలాంటివి ఏ ఇంట్లో జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంకి వైద్యపరీక్షలు అందించాలనే ఉద్దేశ్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ర్పాటు చేయడం జరిగిందన్నారు.*
*జగనన్న ఆరోగ్య సురక్షక కార్యక్రమం గురించి 15 రోజులకు ముందే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారని, అంతేకాక క్యాంపుల ఏర్పాటుపై సైతం ప్రజలకు తెలిపి వారికి ఆరోగ్య సేవలు పొందేలా సహకారం అందించారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.*
*ప్రస్తుతం జరుగుతున్న జగన్నన ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని ఆరు రకాల పరీక్షలతో పాటు కంటి సంబంధిత పరీక్షలు సైతం నిర్వహిస్తారని, సంబంధిత విభాగానికి చెందిన స్పెషలిస్టు వైద్యులను ఈ జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి గ్రామంలో వైద్యసేవలు అందిస్తున్నారని అన్నారు.*
*ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అందరి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాటు పడుతున్నారని, ప్రజలంతా ఇది గమనిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీ నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్దిని మరిచి పాలన సాగించి ఆఖరి ఆరు నెలల్లో పసుపు కుంకుమ పేరుతో రూ.10వేలు అందచేసి చేతులు దులుపుకున్నారని, రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వారికి ప్రతిపక్షానికి పరిమితం చేశారన్నారు.*
*మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి ఆరు నెలల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను అమలు చేసేందుకు ప్రణాళికాబంద్దంగా పనిచేసుకుంటూ వచ్చారని, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు ఆరు నెలల్లోనే లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ప్రజలందరికి సేవలు చేసేలా స్వపరిపాలనకు నాంది పలికారని అన్నారు.*
*ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తప్పనిసరిగా అందచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని, అలాంటి వ్యవస్థలను రూపకల్పన చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా సంక్షేమం, అభివృద్ది లభించిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.*
*దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కోటి సర్టిఫికేట్లు అందచేశారని, ఆత్మకూరు నియోజకవర్గంలో లక్ష వరకు సర్టిఫికేట్లు అందచేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రభుత్వ పథకాలు మరింత చేరువయ్యారన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తునన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2 కోట్ల కుటుంబాలకు వైద్యసేవలు అందించారని అన్నారు.*
Comments are closed.