*నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోండి*
*: జిల్లా కలెక్టర్ ను కలసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రజలు తెలుపుతున్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను కలసి విన్నవించారు.*
*శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ను, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ ఆత్మకూరు ఆర్డీఓ, నియోజకవర్గంలోని అన్ని మండలాల తహశీల్దార్లు, వైఎససార్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలసి ఆత్మకూరు నియోజకవర్గంలో గుర్తించిన రెవెన్యూ సమస్యలను వివరించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ఎక్కువగా రెవెన్యూ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, ఇందుకోసం నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యల విషయంలో సర్వే నిర్వహించి జాబితాలను సిద్దం చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లామని, జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యలపై చొరవ చూపి త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.*
*ఆత్మకూరు నియోజకవర్గంలో చుక్కల భూముల సమస్యల పరిష్కారం కోసం రెండవ విడత కింద ఆరు వేల ఎకరాలు అధికారులు గుర్తించారని, ఈ నెలాఖరులోగా ఆ భూములను నిషేదిత జాబితాల నుండి తొలగించి ప్రజలకు పూర్తిహక్కులు కల్పించే విధంగా చూడాలన్నారు.*
*నియోజకవర్గంలో సాదాబైనామా భూములకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరడంతో స్పందించిన కలెక్టర్ ప్రజలు గ్రామ రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందచేస్తే వారికి చట్టప్రకారం నోటిసులు అందచేసి అర్హులైన వారికి భూములు అందచేస్తామని తెలిపారు.*
*అంతేకాక అధికమంది రైతులు తమ భూములకు నోషనల్ ఖాతాలు ఉన్నాయని, తమకు 1బిలు మంజూరు చేయించాలని విన్నవిస్తున్నారని, ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. స్పందించిన కలెక్టర్ మండల తహశీల్దార్లు మండలం మొత్తం మీద ఇలా ఉన్న అన్నింటిని జాబితాను సిద్దం చేసి జాయింట్ కలెక్టర్ కు నివేదించాలని, సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించవచ్చునని సూచించారు.*
*అసైన్ మెంట్ పట్టాలు మంజూరు విషయంలో అర్హులైన వారికి భూమిపై సాగు చేసుకుంటుంటే వారికి భూములు మంజూరు చేయించే విధంగా చూడాలని కలెక్టర్ కు విన్నవించారు. అదే విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు ఏమైనా ఉంటే గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంటే అది వారికి అందచేసే విధంగా మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.*
*అగ్నికుల క్షత్రియులకు బీసీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేలా చొరవ చూపాలని, మండల అధికారులు వినతిపత్రాలు స్వీకరించి అర్హులైన వారికి బీసీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేలా చూడాలన్నారు. జాతీయ రహదారి 67 నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం పెంపుదల విషయమై విన్నవిస్తున్నారని తెలపడంతో భూములు కోల్పోయిన రైతులు అర్జీలు దాఖలు చేస్తే నష్టపరిహారం పెంపు విషయమై చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు.*
*అనంతసాగరం – మర్రిపాడు మధ్య నిర్మిస్తున్న రహదారి నిర్మాణంలో రెవెన్యూ, దేవాదాయ, అటవీశాఖ అధికారులు ఆ స్థలం పరిధిలోకి వస్తుందంటూ తెలుపుతున్నారని, ఈ విషయమై చొరవ చూపాలని కోరడంతో ఆ మూడు శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.*
*నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కలెక్టర్ ను కోరడంతో స్పందించిన ఆయన అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని తెలిపారు.*
Comments are closed.