The South9
The news is by your side.
after image

నైపుణ్యంతో ఉన్నత ఉద్యోగాలు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

post top

నైపుణ్యంతో ఉన్నత ఉద్యోగాలు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
: పారిశ్రామికంగా అభివృద్దికి కృషి*
స్కిల్ హబ్, జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే*

*ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరాలంటే నైపుణ్యం అవసరమని, అప్పుడే పనిచేసే చోట ఉన్నతస్థాయికి చేరేందుకు అవకాశముంటుందని, ప్రతి ఒక్కరూవృత్తి నైపుణ్యంపై శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

*శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలలో తొలుత స్కిల్ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.*

*స్కిల్ హబ్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం పలు కంపెనీలతో ఒప్పందం చేసుకునే విధంగా సూచించామని, దీని ద్వారా క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.*

*అనంతరం జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.*

Post Inner vinod found

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువత కొందరు ఇంటర్య్వూలకు హాజరయ్యే సమయంలో జీతం తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారని, జీవితంలో ప్రతి ఒక్కటి ఆరంభంలో తక్కువే ఉంటుందని, మీ నైపుణ్యం చూపితే కంపెనీలే మీరు కొరినంత జీతం ఇచ్చేందుకు ముందుకు వస్తాయని వివరించారు.*

*జపాన్ లాంటి దేశాల్లో కంపెనీల్లో 80 శాతం మంది నైపుణ్యంతోనే అతి తక్కువ జీతం నుండి అతి ఎక్కువ జీతానికి పనిచేస్తుంటారన, మన దేశంలో కూడా 60 శాతం ఇలాగే జరుగుతుందని, నిరుద్యోగ యువత తొలుత ఉద్యోగంలో చేరి నైపుణ్యం సంపాదించుకుంటే పరిశ్రమ మీకు తప్పక మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.*

Post midle

*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని, అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా పరిశ్రమ ఏర్పాటు కానుందని, దీని ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ది తప్పక సాధిస్తుందని వివరించారు.*

*ఈ ప్రాంత యువత రానున్న పరిశ్రమలకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చునని పేర్కొన్నారు.*

*అనంతరం జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారందరిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు.*

*కాగా శనివారం జరిగిన జాబ్ మేళాకు 19 కంపెనీలు ఇంటర్య్వూలు నిర్వహించగా 778 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వారిలో 315 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కాగా 121 షార్ట్ లిస్ట్ చేసినట్లు వివరించారు. డీయస్ డీఓ విజయ వినీల్ కుమార్, సీడెప్ జీడీయం హైమావతి, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఏపీఎస్ఎస్ డీసీ, సీడెప్ ఉద్యోగులు ఉన్నారు.*

Post midle

Comments are closed.