The South9
The news is by your side.
after image

బాలుడి కుటుంబాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయం – ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు

post top

తేదీ : 20-06-2023*

 

*స్థలం : తాడేపల్లి*

 

*బాలుడి కుటుంబాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయం – ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు*

 

*బాధిత కుటుంబానికి 24 గంటల్లోనే సాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌..*

 

*నిందితులను పట్టుకున్నాక… ఎమ్మెల్యే అనగాని ధర్నాలు ఎందుకు?*

 

*చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ గ్లోబెల్స్‌ ప్రచారాన్ని నమ్ముకున్నారు..*

 

*మీడియాతో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు*

 

Post midle
Post Inner vinod found

రేపల్లె నియోజకవర్గ పరిధిలో ఉప్పలవారి పాలేనికి చెందిన 15 సంవత్సరాల బాలుడి హత్యకు సంబంధించి నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, అదేవిధంగా ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆ కుటుంబానికి భరోసా కల్పించినట్లు రాజ్యసభ సభ్యులు, రేపల్లె వైఎస్సార్‌ సీపీ ఇంఛార్జి మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. అయితే.. టీడీపీ నాయకుడు చంద్రబాబు వయోభారంతో, మతిమరుపుతో నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారని ఎంపీ మోపిదేవి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. రేపల్లెలో ఇటీవల చోటుచేసుకున్న బాలుడి హత్య.. రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల జరిగిందని తెలిపారు. దీనికి ఎలాంటి రాజకీయ నేపథ్యం, ప్రోద్బలం లేవన్నారు. పనీపాట లేకుండా.. ఖాళీగా ఉంటున్న చంద్రబాబు.. ఏం చేయాలో తెలియక.. బాలుడి హత్యను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుని నీచ రాజకీయాలకు తెరలేపారని ఎంపీ మోపిదేవి మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలు, రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటనను తీసుకువచ్చి.. కుల రాజకీయం, శవ రాజకీయాలు చేయాలని చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ భావించడం సిగ్గుచేటని అని అన్నారు.

 

*24 గంటల్లోనే సాయం చేసిన ప్రభుత్వం మాది..*

బాధిత కుటుంబాన్ని 24 గంటల్లోనే అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం తమదని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. సీఎం జగన్‌ చిత్తశుద్దితే.. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి.. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. రూ.10 లక్షలు అందజేశారని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా.. తన వంతుగా తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. అంతేకాకుండా.. ఆ కుటుంబ సభ్యులు అడిగిన విధంగా ఇళ్ల స్థలం, ఇళ్లు కట్టించడంతోపాటు, ఇంట్లోని అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. హత్యకు పాల్పడిన వారికి వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవన్నీ జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు వచ్చి ముసలికన్నీరు కారుస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు సంబంధం లేని వ్యక్తులను, కులాలను ప్రస్తావిస్తూ.. ఏవేవో పిచ్చిమాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రిషితేశ్వరి అనే అమ్మాయి యూనివర్సిటీలో చనిపోతే.. కనీసం బాధితురాలి కుటుంబ సభ్యుల్ని టీడీపీలో ఏ ఒక్కరూ పలకరించిన పాపాన పోలేదనని ఎంపీ మండిపడ్డారు. తన పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. వనజాక్షి అనే ఎమ్మార్వోని కొడితే… చంద్రబాబు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని మోపిదేవి అన్నారు. దిశ వంటి రక్షణ చట్టాలను తీసుకొచ్చిన మహిళలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమదని ఎంపీ స్పష్టం చేశారు.

 

 

*నిందితులను పట్టుకున్నాక.. ఎమ్మెల్యే ధర్నా ఎందుకో?*

రేపల్లెలో రెండు నెలల కిందట టీడీపీ కౌన్సిలర్‌ హత్యకు గురైతే.. చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని ఎంపీ మోపిదేవి ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ కూడా పట్టుమని అరగంట కూడా కేటాయించకుంటూ.. చుట్టంచూపుగా వచ్చి వెళ్లిపోయారన్నారు. శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడమే చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకోకపోతే ధర్నా, నిరసనలు చేయవచ్చని కానీ.. అప్పటికే.. నిందితులను అదుపులోకి తీసుకునన్నట్లు పోలీసులు చెప్పినా.. బాలుడి మృతదేహాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేయడం శవ రాజకీయాలు కాదా అని ఎంపీ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సీఎం జగన్‌ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి మాట్లాడితే.. నాలుక చీరేస్తాం అని ఎంపీ హెచ్చరించారు.

 

*పవన్‌, లోకేష్‌ చంద్రబాబు స్క్రిప్ట్‌ చదువుతున్నారు..*

మత్య్సకారులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ అని ఎంపీ మోపిదేవి తెలిపారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫిషింగ్‌ హార్టర్లు, మత్య్సకారులకు అనేక రాయితీలు, సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఇవన్నీ పవన్‌ కల్యాణ్‌కి కనబడవని ఎద్దేవా చేశారు. ఆయనకు చంద్రబాబు, టీడీపీ ఆఫీస్‌ నుంచి వచ్చిన పాంప్లెట్‌ను చదువుతున్నారని.. ఇప్పటికీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకపోతే.. రాజకీయంగా జీరోగా మారతారని అన్నారు. అంతేకాకుండా.. పవన్‌, చంద్రబాబు, లోకేష్‌ లు కలిసి వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం మీద గ్లోబెల్‌ ప్రచారానికి తెరలేపుతున్నారని అన్నారు. ఇప్పటికైనా శవ రాజకీయాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని కోరుకుంటున్నట్లు ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు.

Post midle

Comments are closed.