The South9
The news is by your side.
after image

పండగలా విద్యాకానుక పంపిణీ.. మేనమామగా సంతోషిస్తున్నా: సీఎం జగన్

post top

 

*తేది: 12-06-2023*

*స్థలం: క్రోసూరు, పల్నాడు జిల్లా*

*ప్రభుత్వ స్కూళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్*

*నా పేద విద్యార్థులకు అంతర్జాతీయ చదువులే లక్ష్యం.. దీని కోసం పెత్తందరులతో యుద్ధనికైనా సిద్ధం*

*పండగలా విద్యాకానుక పంపిణీ.. మేనమామగా సంతోషిస్తున్నా: సీఎం జగన్*

 

*రాష్టంలోని 52మంది ఇంగ్లీష్ టీచర్లకు ఆమెరికాలో శిక్షణ*

Post midle

*మనది సంక్షేమ రాజ్యం.. చంద్రబాబుది ఓట్ల రాజకీయం*

*మన పథకాలే కాపీ కొట్టి కిచిడి చేస్తున చంద్రబాబు*

 

*మీ జగనన్నకి దత్తపుత్రుడు, బీజేపీ అండ లేకపోయినా పేదల అండ ఉంది*

 

*”వీళ్లు చిన్న పిల్లలు కదా వీళ్లకు ఓటు హక్కు లేదని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది గత పాలకుల విధానం. కానీ, ఈరోజు వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజా ప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొనటం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా” అని అన్నారు ఏపీ సీఎం జగన్*

 

వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూర్‌ ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్రోసూర్‌లో ఏపీ మోడల్‌ స్కూల్‌ను సీఎం జగన్‌ సందర్శించి డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. ఇంటరాక్టివ్‌ ప్యాడ్‌ ప్యానల్‌పై ఆల్‌ ది బెస్ట్‌ అని రాసి విద్యార్థులకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. క్రోసూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విద్యార్థుల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు.

 

Post Inner vinod found

“పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్ధికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశాం“ అని తెలిపారు సీఎం జగన్.

ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాని సీఎం జగన్ చెప్పారు. ప్రతి విద్యార్ధికి రూ. 2400 విలువైన కిట్టు అందించినట్లు తెలిపారు.

 

*ప్రభుత్వ పాఠశాలల్లో AI విధానం: సీఎం జగన్*

 

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో భోధన విలువలను పెంచేందుకు AI సాధనాలు, మెషిన్ లెర్నింగ్ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం జగన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రామాణాలతో బోధన స్థాయి ఉంటుందని అన్నారు. ఈ ఏడాది మీ జగనన్న పుట్టినరోజునే 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు అందిస్తామని తెలిపారు.

 

*విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా..*

 

కార్పొరేట్‌ స్కూళ్లే ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంతో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధించేలా సిద్ధమైందని ‘మనబడి నాడు నేడు’ తొలిదశ స్కూళ్లలో 6–10వ తరగతి వరకు 30 వేలకు తరగతి గదుల్లో బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్‌ బోధన చేపట్టనున్నారు. ఇంగ్లిష్‌ లాబ్స్‌తోపాటు 1–5వ తరగతి వరకు ప్రతి స్కూల్‌లో 10 వేల స్మార్ట్‌ టీవీల ఏర్పాటు దిశగా సన్నద్ధమైందన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా 52మంది ఇంగ్లీష్ టీచర్లకు ఆమెరికాలో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

 

*14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు: సీఎం జగన్*

 

పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని సీఎం జగన్ అన్నారు. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవాళ చంద్రబాబు మొదలుపెట్టారని ఆ 14 సంవత్సరాలు చంద్రబాబు గాడిదలు కాసారా ? అంటూ సీఎం నిలదీశారు. ఇంటింటి కేజీ బంగారమంటా, బెంజ్ కారు ఇస్తారు అంటా.. ఇటువంటి మాటలు చెప్పే బాబును నమ్మవచ్చా అని సీఎం జగన్ ప్రశ్నించారు కేవలం ఎన్నికలప్పుడే వాగ్దానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థకు, పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధమని తెలిపారు. డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి, లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్కు జరుగుతున్న యుద్ధమని తెలిపారు. సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. పచ్చ మీడియా విష ప్రచారానికి, ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధమని.. ఇది జగన్ పై జరుగుతున్న యుద్ధం కాదని.. పేదలపై జరుగుతున్న యుద్ధమమి తెలిపారు. మీ జగనన్నకు ఈనాడు కానీ, టీవీ 5 కానీ, ఏబీఎన్ కానీ అండలేవని, దత్తపుత్రుడు అసలే లేడని సీఎం జగన్ చెప్పారు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదని తెలిపారు. మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను, మీ చల్లని దీవెనలేనని అన్నారు.

 

*ఏపీ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స*

 

దేశంలోనే మన రాష్ట్రంలో విద్యా కీలకంగా సంస్కరణలు చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి విద్యార్ధి ఉన్నతస్థాయిలో నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుస్కూల్ లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లో విద్యా బోధన అందిస్తున్నామని అన్నారు.

 

*గత పాలకులు అమరావతి– తుళ్లూరు రోడ్డు వేయలేకపోయారు: పెదకూరపాడు ఎమ్మెల్యే*

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు–నేడు ద్వారా మా నియోజకవర్గానికి సుమారు రూ.257 కోట్లు సీఎం జగన్‌ ద్వారా మాకు అందాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇందులో కనీసం నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. గత పాలకులు అమరావతి నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయలేకపోయారని ఎమ్మెల్యే శంకర్‌రావు విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు.

Post midle

Comments are closed.