*సీయం జగన్ రైతు బాంధువుడిగా మరోమారు నిరూపించుకున్నారు : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: రేవూరు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం*
*రాష్ట్రంలో రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి వ్యవసాయానికి ముందస్తు ఖర్చుల కింద గురువారం రైతు భరోసా నగదు వారి ఖాతాల్లో జమ చేసి రైతు బాంధవుడిగా మరోమారు నిరూపించుకున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*గురువారం అనంతసాగరం మండలం రేవూరు సచివాలయం పరిధిలోని ఇస్కపల్లి, శంకరనగరం గ్రామాల్లో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ పథకాలను వారికి వివరించి కరపత్రాలను అందచేశారు.*
*సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలిపాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ప్రజలకు తాను అందచేసే సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయా లేదా అని కనుక్కోవడమే కాక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే బాధ్యత కూడా తమపై ఉంచారని పేర్కొన్నారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టాక వరుసగా ఐదో ఏడాది కూడా రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారని వివరించారు.*
*ఈ పథకం ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి అనుబంధ ఛానెళ్లు ప్రతి సంవత్సరం అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారని, అయితే వారి పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోలో ఇంత కంటే ఎక్కువగా రైతులకు నగదు సహాయం చేస్తామంటూ ప్రకటిస్తున్నారని అన్నారు.*
*2014 ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణమాఫీ ఏ మేరకు అమలు చేశారో రాష్ట్రమంతా తెలుసునని, ప్రస్తుతం ప్రజలు వారు ప్రకటించిన మెనిఫెస్టోలో ప్రకటన చూసి నమ్మే స్థితిలో లేరన్నారు.*
*దేశ ప్రధాని నరేంద్రమోడి దేశంలో సంక్షేమ పథకాలకు రూ.9 లక్షల కోట్లు అందచేశానని ప్రకటించారని, అయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా రూ.2.15లక్షల కోట్లు, పరోక్షంగా రూ.90వేల కోట్లు అందచేశారని, దేశమంతామన ముఖ్యమంత్రి పాలన వైపు చూస్తున్నారని వివరించారు.*
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా 3648 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలన్నింటిని తెలుసుకుని నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ది చేసేలా కృషి చేస్తున్నారని, మరో వైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.*
*ప్రతిపక్షాలు సైతం మెచ్చేలా, దేశమంతా తిరిగి చూసేలా సంక్షేమ పాలన అందచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలంతా మరోమారు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.*
Comments are closed.