మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామిని నెరవేర్చిన ఘనత జగనన్నదే : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
*మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామిని నెరవేర్చిన ఘనత జగనన్నదే : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100 రోజలు పూర్తి*
*: ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తాం*
*ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మెనిఫెస్టోలో ఇచ్చిన హామిలు నూటికి నూరు శాతం నెరవేర్చిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*గురువారం చేజర్ల మండలం నాగులవెలటూరు సచివాలయం పరిధిలోని భిల్లుపాడు నాగులవెలటూరు గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు.*
*ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని పలు మంఢలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మొక్క నాటి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు.*
*అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో మెనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వచ్చే మెనిఫెస్టలో జగన్ మోహన్ రెడ్డి ఏమైనా ప్రకటిస్తే తప్పక నెరవేరుస్తారని ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు.*
*రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారని, ఇప్పటికే చుక్కల భూముల సమస్యను 80 శాతం పరిష్కరించారని, ఆత్మకూరు నియోజకవర్గంలోనే 17 వేల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కారమైందని అన్నారు.*
*సాదాబైనామా కోసం నూతనంగా జీఓ విడుదల చేశారని, 100 ఏళ్ల తరువాత రీసర్వే నిర్వహిస్తూ రైతుల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.*
*ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలను పెట్టి వారి కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది సాధించేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో అవసరమైన పనుల కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.*
*చేజర్ల మండలం నాగులవెలటూరు సచివాలయం పరిధిలో ఇప్పటి వరకు సంక్షేమం, అభివృద్ది కోసం రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారని, చిన్న చిన్న సమస్యలను ఇప్పటికే గుర్తించామని, వాటన్నింటిని పరిష్కరించేలా ముఖ్యమంత్రికి తెలిపి పరిష్కరిస్తామని అన్నారు.*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారని, 70 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలను మరింత అభివృద్ది చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.*
*సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరి లాంటి వ్యవస్థలను తీసుకొచ్చారని గ్రామ సుపరిపాలనకు నాంది పలికారని, భవిష్యత్తు తరాలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువే అనే భావించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా అభివృద్ది చేశారన్నారు.*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని, ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.*
*ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకుందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 48 సచివాలయాల ద్వారా 66 గ్రామ పంచాయతీల్లో సుమారు 200 గ్రామాల్లో పర్యటించామని, సుమారు 40 వేల నుండి 50 వేల గృహాల్లో ప్రజలతో మాట్లాడడం జరిగిందని అన్నారు.*
*గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరికి మరింత చేరువై వారితో మమేకం కావడం ఆనందంగా ఉందని, దీని ద్వారా ప్రజలందరి ఆర్థిక, సామాజిక అభివృద్దికి తోడ్పాటునందించేందుకు వీలువుతుందని పేర్కొన్నారు.*
Comments are closed.