సంక్షేమం, అభివృద్ది చూసి ఓర్వలేకనే పిచ్చిరాతలు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
*: నెల్లూరు మేకపాటి నివాసంలో పాత్రికేయుల సమావేశం*
*: కోటి కుటుంబాలను కలిశాం*
*: సర్వే ఫలితాలతో ప్రతిపక్షాలు నిద్రకు దూరం*
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ది పనులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలవడం లాంటివి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తన అనుకూల మీడియాతో పిచ్చిరాతలు రాయిస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*నెల్లూరులోని మేకపాటి నివాసంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ పాలనలో భాగంగా ఇటీవల నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం కోటి కుటుంబాలను చేరుకున్నామని అన్నారు.*
*ఇప్పటి వరకు 80 లక్షల మిస్ట్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉందని అన్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 2024 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 24 స్థానాలు గెలుస్తాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపిందన్నారు.*
*ఇలా సర్వే ఫలితాలు రావడంతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని, గతంలో కూడా ఇదే సంస్థ సర్వేలో చెప్పిన విధంఘానే ఫలితాలు రావడంతో ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోందని అన్నారు.*
*మేము చేసే పనుల్లో చెడు కనిపించకపోవడంతో వారు అనుకూల మీడియా పిచ్చి రాతలు రాయించుకుంటున్నారని, పాత్రికేయ విలువలు దిగజారే విధంగా అబద్దాలు రాయడం ఏపాటిందన్నారు. అవసరమైతే తాము నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్వయంగా వచ్చి పరిశీలించుకోవచ్చునని, ఇదే విషయాన్ని తాను గతంలో ఎన్నోసార్లు తెలిపానన్ననారు.*
*పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామిలన్నింటిని నెరవేర్చారని, ప్రతి ఒక్కరి సంక్షేమం తనదిగా భావిస్తూ నవరత్నాల పథకాలతో అందరికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు.*
*అమ్మఒడి, విద్యాదీవెన, విదేశి విద్య, నాడు నేడు లాంటి పథకాలతో చదువుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూనే, 100 ఏళ్ల తరువాత రీసర్వే నిర్వహించి రైతులకు భవిష్యుత్తులో కూడా కష్టం రానివ్వకుండా చూస్తున్నారని అన్నారు. ఇటీవల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరస్తుందని అన్నారు. ఆర్బికెలు, వ్యవసాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.*
*ఆరోగ్యశ్రీ పరిధిని మరింతగా పెంచి ఇతర రాష్ట్రాల్లో సైతం వర్తింప చేస్తున్నారని, మరిన్ని రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చడం లాంటి అంశాల ద్వారా అందరికి తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.*
*ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వైఎస్సార్సీపీకి భారీ మెజారిటి వచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.*
Comments are closed.