*ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు*
*ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట…!!*
*7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ ‘జగనన్నే మా భవిష్యత్తు’*
*ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయతను ప్రజా మద్దతుగా భావించి నమోదు చేసేలా ‘పీపుల్స్ సర్వే’*
రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు జగనన్న సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్’
రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణల అనంతరం అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు ఏ రాజకీయ పార్టీ ఇదివరకు చేయని భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభించి ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు.
రాష్ర్టానికి మంచి చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల స్థానంలో వాస్తవాలను, సీఎం జగన్ సంక్షేమ రథానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ‘పీపుల్స్ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్ సందేశంతో కూడిన ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది.
సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వైఎస్సార్ సీపీ బలంగా నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు.
*ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత కలిగిన కార్యకర్తలున్న పార్టీ వైఎస్సార్ సీపీ..*
వైఎస్సార్ సీపీ తన సైనికులను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యత గల సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోంది ఈ విషయాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం ద్వారా నిరూపించాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది.
ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ ఉన్నారు. వైఎస్సార్ సీపీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంది. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కూడా ఇచ్చింది.
*ప్రజల నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్’ ప్లకార్డు కార్యక్రమం*
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
Comments are closed.