తేది :16-03-2023*
*రూ.2.79 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్*
*రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు*
*మూలధన వ్యయం రూ.31,061 కోట్లు*
*డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్ల కేటాయింపు.. మంత్రి బుగ్గన*
సుస్థిరత.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 – 24 సంవత్సరానికి గాను రూ. 2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడవ రోజైన గురువారం నాడు శాసనసభలో రాష్ర్ట బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో పేదలకు ఆర్థిక తోడ్డాటును అందించే నవరత్నాలకు పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కీలక కేటాయింపులు చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు ఉండగా, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా చూపించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రధానంగా ఉన్న డీబీటీ స్కీంల కోసం పద్దులో రూ.54,228.36 కోట్ల కేటాయింపులు చేశారు. అంతకు ముందు బడ్జెట్ ప్రతిని అసెంబ్లీలోని శ్రీవారి చిత్రపటం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్లో ప్రధానంగా విద్యా రంగానికి రూ. 29,690 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివ`ద్ధికి రూ. 15,873 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్లు, గ`హనిర్మాణ శాఖకు రూ. 5,600 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 3,951 కోట్లు కేటాయించారు. రాష్ర్ట ప్రభుత్వం నవరత్నాల కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డీబీటీ కోసం రూ.54,228.36 కోట్లను కేటాయించినట్లు మంత్రి బుగ్గన శాసన సభలో పేర్కొన్నారు.
*బడ్జెట్లో విద్యారంగానికి రూ. 29 వేల కోట్లు*
2023-24 బడ్జెట్లో పాఠశాల విద్య కోసం అత్యధికంగా రూ. 29,690 కోట్లు కేటాయింపులు చేశారు. జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు రాష్ర్ట ప్రభుత్వం కేటాయించింది. మన బడి నాడు-నేడు పథకం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలతో సహా 10 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో రూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యా కానుక కోసం బడ్జెట్లో జగనన్న రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయింపులు చేపట్టారు.
*సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా బడ్జెట్*
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ర్ట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు. సుపరిపాలనలో భాగంగా 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించినట్లు మంత్రి శాసన సభకు వివరించారు. వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వించినట్లు పేర్కొన్నారు. కొత్త కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు తాగు నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచి మంగళగిరి, తాడేపల్లిని మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పాటు పరిపాలనా రాజధాని విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ర్టంలో 67 క్రీడా కేంద్రాల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు చేసి స్మృతివనం నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు.
రాష్ర్టంలో మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి నేరుగా ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నామని దీనికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సభలో వివరించారు. దీని కింద సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగినట్లు వివరించారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిని ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నట్లు సభలో పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో 378 ఒప్పందాల ద్వారా రాష్ర్టానికి 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల ఆన్ గ్రౌండింగ్ ద్వారా 6 లక్షలకు పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
*రూ. 41, 436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్*
రాష్ర్ట బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన తరువాత వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభలో రూ.41,436 కోట్ల పద్దుతో రాష్ర్ట వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారని, రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాదని వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. పాల ఉత్పత్తిలో రాష్ర్టం 5 వ స్థానంలో ఉన్నట్లు మంత్రి సభకు వివరించారు. రైతులు విత్తనాలు నాటిన నుంచి కల్లం వద్దే ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్మే వరకు ప్రభుత్వం రైతన్నను వేలు పట్టుకు నడిపించడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి సభలో పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సేవలన్నీ ఆయా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్భీకేల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ర్టంలో 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిల్లో నిర్మాణామవుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించిటనట్లు మంత్రి సభలో వివరించారు.
*ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కీలక హైలెట్స్..*
రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్ల కేటాయింపు
రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
*ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు రంగాల వారీగా ఇలా..*
వైఎస్సార్ రైతు భరోసా : రూ. 4,020 కోట్లు
7578 రైతు బరోసా కేంద్రాల నిర్మాణం: రూ. 40.46 కోట్లు
అగ్రికల్చరల్ టెస్టింగ్ ల్యాబ్లు: రూ. 36.39 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల భీమా: రూ. 1,600 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ రుణాలు: రూ. 500 కోట్లు
వ్యవసాయం యంత్రాల ఆధునీకరణ: రూ. 1,212 కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: రూ. 15,882 కోట్లు
డాక్టర్ వైఎస్సార్ ఆసరా 4వ విడత: రూ. 6,700 కోట్లు
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ: రూ. 1000 కోట్లు
వైఎస్సార్ చేయూత: రూ. 5,000 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం: రూ. 3,951 కోట్లు
జగనన్న అమ్మ ఒడి: రూ. 6,500 కోట్లు
మన బడి నాడు-నేడు: రూ. 3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక: రూ. 560 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ. 2,841 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ. 2,200 కోట్లు
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అదనపు కేటాయింపులు: రూ. 1,000 కోట్లు
పాఠశాల విద్య : రూ. 29,690 కోట్లు
ఉన్నత విద్య: రూ. 2,064 కోట్లు
పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి: రూ. 15,873 కోట్లు
మున్సిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి: రూ. 9,381 కోట్లు
నైపుణ్యాభివృద్ధి: రూ. 1,166 కోట్లు
యువత సాధికారత, పర్యాటకం మరియు సాంస్కృతిక అభివృద్ధి: రూ. 291 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ. 21,434 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం: రూ. 550 కోట్లు
వైఎస్సార్ భీమా: రూ. 372 కోట్లు
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: రూ. 610 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం: రూ. 200 కోట్లు
జగనన్న తోడు: రూ. 35 కోట్లు
జగనన్న చేదోడు: రూ. 350 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర: రూ. 275 కోట్లు
వైఎస్సార్ లా నేస్తం: రూ. 17 కోట్లు
మత్స్యకార డీజిల్ సబ్సిడీ: రూ. 50 కోట్లు
మత్స్యకార భరోసా: రూ. 125 కోట్లు
రైతు కుటుంబాల పరిహారం: రూ.20 కోట్లు
వైఎస్సార్ కళ్యాణమస్తు: రూ. 200 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 3,000 కోట్లు
షెడ్యూల్ కుల భాగాలు: 20,005
షెడ్యూల్ తెగ భాగాలు: 6,929
వెనుకబడిన తరగతుల భాగాలు: 38,605
కాపు సంక్షేమ నిధి: 4887 కోట్లు
మైనారిటీ సంక్షేమం: 4203 కోట్లు
జగనన్న గృహనిర్మాణ పథకం: రూ. 5,600 కోట్లు
పరిశ్రమలు మరియు వాణిజ్యం: రూ. 2,602 కోట్లు
రోడ్డు, భవనాలు: రూ. 9,118 కోట్లు
నీటిపారుదల మరియు జలవనరులు: రూ. 11,908 కోట్లుCr
పర్యావరణం, అటవీ & సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ. 685 కోట్లు
ఇంధన రంగం: రూ. 6,546 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ: రూ. 3,858 కోట్లు
గడప గడపకు మన ప్రభుత్వం : రూ. 532
Comments are closed.