*తేది: 28-02-2023*. తెనాలి*
*రైతు బాగు కోసం రైతన్న ప్రభుత్వం*
*వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత ఆర్థిక సాయం విడుదల*
*నాలుగేళ్లలో రైతులకు రూ. 1.45 లక్షల కోట్ల సాయం*
*రాష్ట్రంలో ఏకంగా 166 లక్షల టన్నులకు చేరిన పంట దిగుబడి*
*కరువు, కుతంత్రానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు*
*పేదల ప్రభుత్వానికి.. పెత్తందారీల ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఇది*
*తెనాలి బహిరంగ సభలో సీఎం జగన్*
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా నమ్మి రైతన్నకు పెట్టుబడి సాయం రూపంలో ఆర్థిక సాధికారత అందించడమే ధ్యేయంగా మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్న విత్తనం నాటిన నాటి నుంచి పంటను మద్ధతు ధరకు అమ్మే వరకు తోడుగా ఉండి రైతు సుభిక్షం కోరుకునే ఏకైక ప్రభుత్వం మనదేనని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తెనాలిలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో సీఎం జగన్ 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడో విడత సాయం అందిస్తున్న రూ. 2 వేల మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. నాలుగో ఏడాదికి సంబంధించి గత రెండు విడతల్లో రూ. 7,500 మరియు రూ. 4000 ను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. మూడో విడద సాయం కింత రూ. 1090.76 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో పాటు డిసెంబర్ లో సంభవించిన మాండూస్ తుఫాన్ కారణంగా నష్ట పోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన వన రైతులకు రూ. 76.99 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ ఆయా రైతుల ఖాతాల్లో జమచేశారు. మూడున్నరేళ్లలో 22 లక్షల రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ సాయం అందించామని వివరించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా కోటిన్నర కుంటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో రైతన్నకు రూ. 13, 500 రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల హామీలో పేర్కొన్న రూ. 12, 500 కంటే అదనంగా మరో రూ. 1000 ను అధికారంలోకి వచ్చిన నాటి ఖచ్ఛితంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద మేలో రూ. 7,500 అక్టోబర్ లో రూ. 4000 ఫిబ్రవరి రూ. 2000 అందిస్తున్నట్లు సీఎం జగన్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ రోజు అందించిన సాయంతో కలిపితే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ. 54 వేల లబ్ధి చేకూరిందని వివరించారు. వచ్చే ఏడాది అందించే మొత్తం కలిపి ఐదేళ్లలో రూ. 67,500 సాయం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందించినట్లు అవుతుందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రైతు భరోసా పథకం కోసమే కోసం రూ. 27,062 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. రైతులన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. వ్యవసాయం అంటే రైతుల బాగు కోరడమేనని ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.
*సాయంలో చంద్రబాబులా మాయలు, మోసాలు లేవు*
ఆహార భద్రతతో పాటు 62 శాతం మంది ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అంటే వైఎస్సార్ సీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు రైతు కూలీలతో కలిపిన వ్యవసాయం బాగుంటేనే రాష్ర్టం బాగుటుందన్నారు. రైతులకు అందించే సాయంతో కోతలు విధించి ఖర్చు తగ్గించుకునే మాయలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంత మాత్రం లేవని సీఎం జగన్ అన్నారు. ఆ మాయలు, మోసాలుకేవలం చంద్రబాబు మాత్రమే చేయగలరని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో నవరత్నాల కింద ప్రజలకు అందించిన సాయాన్ని ఒక్క సారి అందరూ గమనించాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు. టీడీపీ హయాంలో కరువుపై యుద్ధం పేరుతో తెచ్చిన రెయిన్ గన్నుల అవినీతి లేదని, కేవలం రెయిన్ మాత్రమే ఉందని సీఎం జగన్ చలోక్తులు విసిరారు. కరువు వచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం రెయిన్ గన్నుల పేరుతో పేరుతో అవినీతికి పాల్పడటం దారుణమని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్య మంత్రి గా ఉంటూ కరువును తోడు తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం లేనంత సుభిక్షంగా ఉండటం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు.
*కరువుకు కేరాఫ్ అడ్రస్.. చంద్రబాబు*
ఈ అన్యాయస్తుడు చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు కరువే ఉందని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రం చరిత్రలో గతాన్ని చూస్తే చంద్రబాబు కరువు మాత్రమే కనిపిస్తుందన్నారు. 2019 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయతో ఎక్కడా కరువులేదని వర్షాలు సుభిక్షంగా పడ్డాయని సీఎం పేర్కొన్నారు. మంచి మనసుతో పరిపాలన చేస్తే ఇలా ఉంటుందని టీడీపీకి సీఎం జగన్ చురకలంటించారు. ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్క గ్రామంలో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చూసినా ఎడారిగా మారుతుందని ప్రకటించిన అనంతపురం జిల్లాలో కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డాయని వివరించారు. వర్షాలు పడటంతో పాటు నాలుగేళ్లలో పంట దిగుబడి 12 టన్నులు పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో పంట దిగుబడి 154 లక్షల టన్నులైతే వైఎస్సార్ సీపీ పరిపాలనలో 166 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. గత టీడీపీ పాలించిన ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నులు ధాన్యం సేకరణ చేయగా, మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం 2.94 కోట్ల ధాన్యం సేకరించామని వివిరంచారు. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ. 40,230 కోట్లు ఖర్చు చేస్తే రూ. 55,400 కోట్లు ఖర్చు చేసామని సీఎం జగన్ వివరించారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్ల ఈ మూడున్నరేళ్లలో ఉద్యానవన పంటలు 1.43,900 హెక్టార్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దిగుబడి తీసుకుంటే గతంలో ఏటా 228 లక్షల టన్నులు ఉండగా ఈ ప్రభుత్వంలో రైతన్నల కష్టం, ప్రభుత్వ క`షితో 332 లక్షల టన్నులు పెరిగిందని ఏకంగా 104 లక్షల టన్నుల అధిక దిగుబడి సాధించామని సీఎం జగన్ తెలిపారు. మన మంచి ప్రభుత్వాన్ని దేవుడు చూశాడు దేవుడు విన్నాడు, దేవుడు ఆశీర్వదించారని అందుకే ప్రతి ఇంట్లో అభివృద్ధి చూస్తున్నామని వివరించారు.
*దేశానికి ఆదర్శనీయంగా ఏపీలోని ఆర్బీకేలు*
ఆర్బీకేలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావించడంతో పాటు, ఇతర దేశాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రతినిధులు సందర్శించి వెళుతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ పంటల భీమా ద్వారా 44.48 లక్షల రైతన్నలకు రూ. 6,685 కోట్ల భీమా సొమ్ము అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇదే పథకాన్ని కేవలం 30 లక్షల రైతులకు మాత్రమే వర్తింప చేశారని కేవలం రూ. 3,411 కోట్లు మాత్రమే పంటల భీమా కింద చెల్లించారని విమర్శించారు. రైతులు ఈ విషయాన్ని ఆలోచించాలని సీఎం జగన్ కోరారు. కోతలు ఎలా పెట్టాలో ఖచ్ఛితంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతన్నలకు రెండింతల సాయం అందిందన్నారు. ఈ క్రాప్ ద్వారా నోటిఫై చేసిన ప్రతి పంటలకు ఆటోమేటిక్ గా ఇన్సూరెస్ కవరేజి వస్తుందని వివరించారు. సొంత గ్రామంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. తుఫాన్లు, వరదలతో నష్ట పోయిన రైతులకు లంచాలు, వివక్ష లేకుండా నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి అందిస్తున్నట్లు వివరించారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సీడీ ఇచ్చామన్నారు. ఉచిత కరెంట అంటే వైఎస్సార్ పేరు గుర్తుకు వస్తుందని ఈ నాలుగేళ్లలో ఉచిత విద్యుత్ కోసం చేసిన ఖర్చు రూ. 27,800 కోట్లుగా ఉందని వివరించారు. రైతన్నలకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం రూ. 1,500 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల సామర్థ్యం పెంచామని సీఎం జగన్ గుర్తుచేశారు.
*చంద్రబాబు ఎగరగొట్టిన పెండింగ్ బకాయులు చెల్లించాం*
చంద్రబాబు పెండింగ్ పెట్టిన బకాయిలను కూడా చిరునవ్వుతో మన ప్రభుత్వం బకాయిలు తీసర్చిందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ ఉంచిన బకాయిల గురించి వివరిస్తూ సున్నావడ్డీ కింద రూ. 1834 కోట్లు, విత్తన బకాయిలు రూ. 384 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు చంద్రబాబు రైతులకు ఎగరగొట్టి పోతే ఆ రైతన్నల కోసం మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించామని సీఎం జగన్ వివరించారు. కేవలం రైతుల కోసం మూడున్నరేళ్లలో లక్షా నలభై వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు. మేనిఫఎస్టో నుంచి రైతుల హామీల వరకు మాట తప్పిన చంద్రబాబు, భజన బందం, దుష్ట చతుష్టాయికి ఇవన్నీ చేసేప్పటిక కడపు మంట పుడుతోందని విమర్శినంచారు. ఈ కడుపు మంటకి మందు లేదని, మనది పేదలు, రైతన్నల ప్రభుత్వం, చంద్రబాబుది పెత్తందారుల పార్టీనని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ర్టంలో జరిగే ఎన్నికల యుద్ధంలో రైతులను వంచించిన చంద్రబాబు ఒక వైపు, రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ఒక వైపు ఉందన్నారు. కరువుతో ఫ్రెండ్ షిప్ ఉన్న బాబుకు, సుభిక్ష పాలన అందించిన మనం ఒక వైపు అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు.. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం చదువులు ఇచ్చిన మనకు జరిగే యుద్ధంగా ప్రజలు భావించాలని సీఎం జగన్ కోరారు. పొందు సంఘాల మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబుకు, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఆర్థిక భరోసా ఇస్తూ 30 లక్షల ఉచిత ఇళ్లు కట్టిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి జరిగే యుద్ధమని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల రాక్షల పాలన.. గజదొంగల ముఠా అమలు చేసే దోచుకో పంచుకో తినుకో వర్గానికీ పేదల కోసమే నిలిచి గ్రామాల రూపు రేఖలను సచివాలయాలు, ఆర్బీకేలు, బాగు చేసిన ప్రభుత్వ బడులు, విలేజ్ క్లినిక్ రూపంలో అభివృద్ధికి బాటలు వేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తేడా ఎంతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
*పేదల డబ్బు పెత్తందారీల జేబుల్లోకి*
గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉన్నా ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రజలు చంద్రబాబును నిలదీయాలని సీఎం జగన్ కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా సాయం అందించామని సీఎం జగన్ సభలో వివరించారు. ఇప్పుడు పేదలకు అందిన డబ్బు పెత్తందారీల జేబుల్లోకి వెళ్లిందని విమర్శినంచారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు అండ్ కో కు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ రాజకీయ సమానత్వం తెచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధంలో మంచి జరిగిన ప్రతి ఒక్కరూ సైనికులుగా నిలుస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని. క్లాస్ వార్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద వాడు ఒకవైపు పెత్తందారీ మరో వైపు నిలిచిన ఈ యుద్ధంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా రాజకీయాల్లో మాట ఇవ్వడం మాట మీద నిలబడ్డం జరగదని వ్యాఖ్యానించారు. పేదవాడిని మరింత పేదరికంలోకి తొక్కేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయతే ప్రమాణంగా రాజకీయాలు తాము మేనిఫెస్టో పక్కాగా అమలు చేసి మీ బిడ్డ ఓటడిగేందుకు వస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే మీ బిడ్డకు భయం లేదని. ఈ ధీమాతోనే 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే దమ్ము దత్తపుత్రుడికి ఉందో లేదో తేల్చుకోవాలని సీఎం జగన్ సవాల్ విసిరారు. వాళ్లకి ఆ ధైర్యం లేదు కారణం ఏ రోజు ప్రజలు మీరు మంచి చేయలేదని ప్రజలకు మంచి చేశాం కాబట్టే మరో సారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అండ్ కో కుట్రలు మరింత ఎక్కువ కనిపిస్తాయని ఇవన్నీ చూసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకావాల్సిన అవసరం ఉందని ఈ యుద్ధంలో మంచి అందుకున్న మీరే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు.
*తెనాలి అభివృద్ధికి 43 కోట్లు మంజూర చేసిన సీఎం జగన్*
తెనాలి ఎమ్మెల్యే శివ కుమార్ కోరిక మేరకు తెనాలి నియోజిక అభివృద్ధి పనులకు గాను 43 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం 10 కోట్లు, ఎస్ సి కాలనీ శ్మశానవాటిక కొరకు 9 కోట్లు, షాదీ ఖానా కు 4 కోట్లు, మున్సిపాలిటీ భవనానికి 15 కోట్లు, వ్యవసాయ మినీ యార్డు కు 5 కోట్లు రూపాయలు ప్రకటించారు సీఎం జగన్.
Comments are closed.