The South9
The news is by your side.
after image

నేడు ఆత్మకూరు ముద్దుబిడ్డ, పొలిటికల్ జెంటిల్మెన్ మేకపాటి గౌతంరెడ్డి మొదటి వర్ధంతి.

నెల్లూరు ప్రతినిధి  :  ఆత్మకూరు ముద్దుబిడ్డ, పొలిటికల్ జెంటిల్మెన్ మేకపాటి గౌతంరెడ్డి మొదటి వర్ధంతి.                       నేడు దివంగత నేత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం వారి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి లో జరగనుంది. గత సంవత్సరం క్రితం ఇదే రోజు ఉదయం 7 గంటల సమయంలో చాతిలో నలతగా ఉందని చెప్పి హాస్పిటల్ కి వెళ్లే సమయంలో గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో తో పాటు మేకపాటి గౌతంరెడ్డి గురించి తెలిసిన తెలియని వారందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఒక హుందా అయిన రాజకీయ నాయకుడు ఆకస్మికంగా మరణించడం బాధ కలిగిందని పలువురు రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలో తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వారి తమ్ముడు మేకపాటి విక్రం రెడ్డి 80 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించడం విధితమే. దానికి తగ్గట్టుగానే అన్నకు మించిన తమ్ముడుగా మొట్టమొదటిసారి జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మేకపాటి విక్రమ్ రెడ్డి. అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఎంజీఆర్ ఫౌండేషన్ పేరుతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటుచేసి తమ సొంత నిధులు 10 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. ఆత్మకూరు మోడల్ బస్టాండ్ కి మూడు కోట్ల రూపాయలతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఈరోజు జరగవలసిన ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిపారు . ఈ వర్ధంతి కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అభిమానుల్ని వివిధ రంగ ప్రముఖులకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించే దానికి నిర్వహణ ఏర్పాట్లు ను దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి.

Post midle

Comments are closed.