*తేదీ: 16-02-2023*
*రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం*
*11.43 జీఎస్డీపీ తో వృద్ధిబాటలో ఏపీ*
*40 వేల కోట్ల పెట్టుబడుల సాధనతో దేశంలోనే అగ్రస్థానం*
*పవర్ లేదనే కడుపు మంటతోనే చంద్రబాబు అసత్యాలు*
*గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు*
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలవడం సీఎం జగన్ సమర్థతకు నిదర్శనమని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశవ్యాప్తంగా DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా, ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రూ.80 కోట్లు ఖర్చు చేసి, ఐదు సార్లు దావోస్ పర్యటనలకు వెళ్లి ఏం సాధించారని విమర్శించారు. చంద్రబాబు దుబారా ఖర్చుల కోసం తెదేపా ప్రభుత్వంలో చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని మండిపడ్డారు. గత చంద్రబాబు పాలనలో అమరావతి గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేసినట్లు అభివ్రుద్దిపై తప్పుడు ప్రచారాలతో మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి పెట్టుబడులపై ఎల్లో మీడియాతో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేసిన చంద్రబాబు కొత్త అబద్దాలతో ఏకంగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పవర్ లేదనే అసహనంతో చంద్రబాబు, లోకేష్ లు అసలైన సైకోలుగా మారి తప్పుడు ప్రచారమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
*చంద్రబాబువి గ్రాఫిక్స్ రాజకీయాలు*
సీఎం జగన్ తన పాదయాత్రలో సమాజంలోని అసమానతలు, పేదరికాన్ని దగ్గర నుంచి చూసి చలించి పోయి నవరత్నాలను అమలు చేస్తున్నారని తద్వారా గత మూడున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అసమానతలు తొలిగాయని వివరించారు. పాదయాత్రలో ఇచ్చిన ఒక్క మాటను కూడా తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్న సీఎం జగన్ కు గెలవగానే మేనిఫెస్టోనో చెత్తబుట్టలో విసిరిన చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లలో కూరగాయల మార్కెట్ అభివృద్ధి, రాజవీధి అభివ్రుద్ధి పనులను పూర్తి చేసినట్లు వివరించారు. ఆటో నగర్ ను ప్రత్యేక చొరవతో అభివృద్ధిచేశామని వెల్లడించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు, ప్రతి వీధికి చేరిందని అందుకు నిదర్శనమే సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేల నిర్వహణ అని పేర్కొన్నారు.
*యువతకు ఉపాధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన*
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రూ.80వేల కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న పరిశ్రమల్లో లక్షల మంది యువతకు ఉపాధి లభించనుందని వివరించారు. చంద్రబాబు, కరవు కవలపిల్లలుగా సాగిన 2014 నుంచి 2019 పరిపాలన కంటే ఈ మూడున్నరేళ్ల పరిపాలన సుభిక్షంగా సాగుతోందన్నారు. కోవిడ్ సమయంలో మూతపడే పరిస్థితికి వెళ్లిన ఎంఎస్ఎంఈలను తమ ప్రభుత్వం ఆదుకుందని, రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద రూ.7,976 కోట్ల పైచిలుకు రుణాలను 1.78 లక్షల ఎంఎస్ఎంఈ ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. ఎస్ఐపీబీ ఆమోదం అనంతరం రెండ్రోజుల క్రితం కడపలో రూ.8,800 కోట్ల పెట్టుబడితో సీఎం జగన్ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దీంతో పాటు రూ.6,330 కోట్లతో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు, రూ.8,855 కోట్లతో ఏర్పాటు కాబోయే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పెట్టుబడుల చరిత్రలో మైలు రాయిగా నిలవనున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులు సాధించడంలో దేశంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో మూడో స్థానంలో నిలవడం సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనమన్నారు. సైబరాబాద్ ను తానే కట్టానని చెప్పుకునే అబద్దాల చంద్రబాబు పాలనకు చెప్పిన మాటను పక్కాగా అమలు చేసే సీఎం జగన్ పాలనకు ఉన్న తేడాను ప్రజలు తెలుసుకున్నారని ఇదే వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు.
*రాష్ట్రంలో పెట్టుబడులపై ఎమ్మెల్యే వెల్లడించిన వివరాలివీ..*
మన రాష్ట్రం 11.43శాతం GSDPతో 2021-22లో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఏపీ వుంది.
జాతీయ GDP 8.7 నమోదు అవ్వగా… రాష్ట్ర GSDP కేంద్ర జిడిపి కన్నా 2.73 శాతం ఎక్కువ.
కొవిడ్ 19 సమయంలో భారత దేశ వృద్ది రేటు -6.60 శాతం నమోదైన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 0.08 శాతం వృద్దిరేటును నమోదు చేసింది.
రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువ.
దేశంలోనే మన రాష్ట్ర తలసరి ఆదాయంలో 6వ స్ధానంలో వుంది.
చంద్రబాబు పాలనలో 2018-19లో 5.36 శాతం వృద్దిరేటు వుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో 2021-22 నాటికి 11.43 శాతం వృద్దిరేటు నమోదైంది.
జూన్ 2022లో టైర్ల రంగంలో ప్రపంచంలోననే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైన ATC అలయన్స్ టైర్స్ రూ.1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ కోసం పెట్టుబడి పెట్టింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా 4సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
BDP బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా అన్ని దక్షిణ భారత రాష్ట్రాలలో AP అగ్రగామిగా నిలిచింది.
ఆగస్టు 2022లో తూర్పు గోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ను స్థాపించడానికి కేంద్రం నుండి ₹1,000 కోట్ల గ్రాంట్‌ను పొందింది.
YSR కడపలోని కొప్పర్తిలో YSR జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, YSR ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,155 ఎకరాల విస్తీర్ణంలో హబ్‌ను అభివృద్ధి చేసి డిసెంబర్ 23, 2021న ప్రారంభించింది.
Comments are closed.