*గృహ సారధులు విజయానికి వారధులు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ఆత్మకూరులో గృహ సారధులతో సమావేశం*
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లు ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నారని, వారి పరిధిలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన గృహ సారధులు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలుజరిగేలా చేసి వైఎస్సార్సీపీ మరోమారు ఘన విజయానికి వారధులుగా పనిచేయాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*సోమవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్ తో కలసి ఆత్మకూరురూరల్, టౌన్ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారధులతో శిక్షణా సమావేశం నిర్వహించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో తాను చేసిన పనులను చసి ఒటేయ్యండి , మూడున్నర సంవత్సరాలలో తాను అందచేసిన లబ్ది చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.*
*గత ఎన్నికలకు ముందు ప్రజలకు హామిలు ఇచ్చి 151 సీట్లు గెలుపొందారని, ఇప్పుడు అమలు చేసిన హామిలతో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీంతో 175 స్థానాల్లో విజయం సాధించడం తధ్యమన్నారు.*
*అనేక సంక్షేమ పథకాలను అందచేయడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ మరోమారు ఆశీర్వదించాలని పేర్కొన్నారు.*
*ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి గృహ సారధుల సేవలను వినియోగించుకోనున్నదని, గృహ సారధులు, సచివాలయ సమన్వయకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలను ప్రతి గడపలో వివరిస్తూ మన ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నారు.*
*పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గృహసారధులు శ్రమించాలని ఆయన కోరారు. గృహ సరాధులు తాము ప్రజా సేవలను బాధ్యతగా నిర్వహిస్తున్నామని భావించాలని సూచించారు.*
*ఈ సందర్భంగా గృహ సారధుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందచేసే కిట్లు, అందులోని వస్తువులను గురించి వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల వద్ద మన ప్రభుత్వ పనితీరు తీరు ఏ విధంగా ఉందో ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు.*
*గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, మండల కో ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా ప్రతి ఇంటికి మన పార్టీ ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన కోరారు.*
*అంతకు ముందుకు సచివాలయ మండల కో ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను, పరిశీలకులను ఘనంగా శాలువాలతో సత్కరించారు.*
Comments are closed.